Ring Of Fire: సౌరకుటుంబంలో మరో అద్భుతం.. కంకణాకార సూర్యగ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుందంటే..?

సౌరకుటుంబంలో రోజుకు ఒక వింత జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఈ శనివారం అక్టోబర్ 14న అంతరిక్షంలో ఒక దృశ్యం కనిపించనుంది. అదే సూర్యుని లోపల నల్లని ఆకారంలో ఒక వలయం కనిపించనుంది. దీనిని శాస్త్రీయ భాషలో రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. తెలుగులో అయితే కంకణాకార సూర్య గ్రహణం అని పిలుస్తున్నారు.

  • Written By:
  • Publish Date - October 11, 2023 / 02:20 PM IST

ఈ ఏడాదిలో వచ్చే చివరి సూర్యగ్రహణం రోజున ఖగోళంలో ఈ వింత చోటు చేసుకోబోతుంది. అయితే ప్రతి సూర్య గ్రహణం రోజున ఇలా జరుగదు అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ సారి మాత్రమే ఇలా జరగడానికి ప్రదాన కారణం చంద్రుడు ప్రత్యేక స్థానంలో ఉండటమే.‎ సాధారణంగా సూర్యునికి చంద్రుడికి మధ్య భూమి అడ్డం వస్తే ఆ నీడ భూమిపై పడుతుంది. ఇలా చర్య జరిగే సమయంలో ఒక్కోసారి సూర్యుడు పూర్తిగా చంద్రుడి వెనుక కనపడకుండా ఉంటాడు. దీనిని సంపూర్ణ సూర్య గ్రహణం అంటారు. అయితే ఒక్కోసారి కంకణం ఆకారంలో గుండ్రంగా మెరుస్తూ సన్న గీతలా కనిపిస్తాడు. ఇలా సూర్యుడి చుట్టూ గీతలా కనిపించడాన్ని కంక‎ణాకార సూర్యగ్రహణం అంటారు. ఈ గుండ్రని గీతను యాన్యూలస్ అంటారు.

ఈ వలయం కనిపించేడానికి కారణం..

మామూలు రోజుల్లో సంపూర్ణ సూర్య గ్రహణం రోజు చంద్రుడు, సూర్యుడిని పూర్తిగా కప్పేస్తూ ఉంటాడు. అయితే వార్షిక సూర్య గ్రహణం రోజు.. చంద్రుడు భూమి కక్ష‌్యకు దూరంగా తిరుగు ఉంటాడు. దీని కారణంగా గగనతలంపై సూర్యుని కంటే కూడా కొంచం చిన్నగా కనిపిస్తాడు చంద్రుడు. ఇలా చిన్నగా కనిపించే క్రమంలో ఒక వలయం తక్కువగా కప్పినట్లు కనిపిస్తుంది. దీని కారణంగానే చుట్టూ నల్లగా కప్పి ఉంచి చూట్టూ వృత్తాకార అంచులు మాత్రం భగభగమని మెరిసిపోతూ ఉంటాయి. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. ఈ గ్రహణం పశ్చిమ ప్రాంతంలోని ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికాలో ఉదయం పూట ఏర్పడుతుంది. అంటే ఆ సమయంలో మనకు రాత్రి అనమాట. శాస్త్రీయ భాషలో చెప్పాలంటే గ్రహణ సమయంలో మన దేశం చంద్రుడికి వ్యతిరేక దిశలో ఉంటాడు. చంద్రుడు కనిపించే సమయానికి మన దేశంలో తెల్లవారిపోయి రోజు మారిపోతుంది. దీని కారణంగా ఈ సూర్య గ్రహణం మనకు సంభవించదు అని చెప్పాలి.

నాసా ద్వారా ప్రత్యక్ష ప్రసారం..

ఈ వింతైన దృశ్యాన్ని వీక్షించేందుకు అమెరికా అంత్యరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. దీనిని అమెరికా వాసులే కాకుండా ప్రపంచ దేశాలన్నింటికీ చూపించేలా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. దీనిని భారతీయులు సైతం వీక్షించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మన దేశ కాలమానం ప్రకారం రాత్రి 8.35 గంటలకు కనిపించనుంది.

గ్రహణం కనిపించే ప్రాంతాలు..

ఈ సూర్యగ్రహణం అమెరికాలోని కాలిఫోర్నియా, నెవాడా, ఒరెగాన్, ఉటా, అరిజోనా, న్యూ మెక్సికో రాష్ట్రాల్లో మాత్రమే ముందుగా కనిపించనుంది. మెక్సికో, గ్వాటెమాల, బెలిజ్, హోండురాస్, నికరాగ్వా, కొలంబియా, బ్రెజిల్, పనామాల్లో మధ్యాహ్నం తరువాత సూర్యాస్తమయానికి ముందుగా కనిపించనుంది.

T.V.SRIKAR