Google: గూగులమ్మకు పాతికేళ్లు.. చిన్న గ్యారేజ్ నుంచి పెద్ద సామ్రాజ్యన్ని ఎలా విస్తరించిందో తెలుసా..?

ఏ సమాచారం కావాలన్నా నేటి యుగంలో గూగుల్ లో ఎంటర్ చేస్తారు. అవసరమైన డేటాను సేకరించి తన సమస్యలకు పరిష్కారాలు కనుగొంటారు సగటు మానవుడు. అలాంటి గూగుల్ తన 25వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా గూగుల్ గురించి పూర్తి సమాచారం మీకోసం.

  • Written By:
  • Publish Date - September 27, 2023 / 01:25 PM IST

గూగుల్.. ఇప్పటి ఆధునిక పరిస్థితుల్లో జీ మెయిల్ మొదలు, యూట్యూబ్ వరకూ ఉద్యోగం కావాలన్నా.. వినోదం అందించాలన్నా కీలక పాత్ర పోషిస్తోంది గూగుల్. ఆండ్రాయిడ్ వర్షన్లకైతే దీనిని ప్రాణంగా చెప్పాలి. ఫోన్ ఉంటే ఏం లాభం.. సమాచారం కావాలంటే గూగుల్ అనుబంధ అన్ని సాఫ్ట్ వేర్లు అవసరం. ఇవి లేకుండా స్మార్ట్ ఎలక్ట్రానికి పరికరాలు ఏవీ పనిచేయవు. దీనిని ఢీ కొట్టేందుకు ఎన్ని రకాలా ప్రయత్నాలు చేస్తూ ప్రత్యమ్నాయ మార్గాలు అన్వేషించినా అవన్ని బూడిదలో పోసిన పన్నీరులాగా మిగిలిపోయాయి. ఇంతటి గొప్పతనం ఉన్న గూగుల్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

గూగుల్ పదంలో మార్పు..

సర్చింగ్ దిగ్గజం గూగుల్ ఈరోజు తన 25వ పుట్టినరోజును ప్రత్యేక డూడుల్‌తో జరుపుకుంటోంది. Google Inc. సెప్టెంబరు 4న స్థాపించబడింది, అయితే ఒక దశాబ్దం తరువాత ఈ కంపెనీ తన పుట్టినరోజును సెప్టెంబర్ 27కు మార్చుకుంది. అందుకే ఈ రోజు, కంపెనీ ఈ ప్రత్యేక సందర్భాన్ని గుర్తుచేసుకోవడానికి తన మెమరీ లేన్‌లోకి వెళ్లి విభిన్న డూడుల్‌లను ప్రదర్శించింది. నేటి Google Doodle ని GIFతో ఏర్పాటు చేసింది. అది ‘Google అనే పదాన్ని ‘G25gle’గా మారుస్తుంది. రానున్న భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తన నైపుణ‌్యం ప్రతిబింబించేలా ఈ టెక్ సంస్థ పనిచేయనున్నట్లు ప్రకటించింది.

25 ఏళ్లు.. 6 ఖండాలు.. 200 నగరాల్లో సామ్రాజ్యం..

నేడు గూగుల్ 25 వ వసంతంలోకి అడుగు పెట్టినప్పటికీ తాను ఎలా మారుతూ అభివృద్ది చెందుతూ వచ్చామో తెలిపేందుకు మెమరీ లేన్‌లో భద్రంగా డేటాను పొందుపరుచుకుంది. ఈ విషయాన్ని తన బ్లాగ్ లో రాసుకొచ్చింది. 25 సంవత్సరాల క్రితం, కాలిఫోర్నియా సబర్బ్‌లోని గ్యారేజ్ నుండి Google శోధన ప్రారంభించబడింది. నేడు, మేము ఆరు ఖండాలలో 200 నగరాల్లో కార్యాలయాలతో పాటూ డేటా కేంద్రాలను కలిగి ఉన్నామని వెల్లడించింది. నేడు మా సిల్వర్ జూబ్లీ వేడుకను పురస్కరించుకుని, మాతో కలిసి ప్రపంచ పర్యటనలో పాల్గొనండి అని పేర్కొంది.

ఈ ఇద్దరే కీలకం..

90వ దశకం చివరిలో స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్‌లో ప్రావిణ్యం కలిగిన సెర్గీ బ్రిన్, లారీ పేజ్ అనే విద్యార్థులు గూగుల్ ని Googleని స్థాపించారు. వరల్డ్ వైడ్ వెబ్‌ను మరింత ప్రాముఖ్యం సంతరించుకునేలా ఒకే రకమైన దృష్టిని ఇద్దరూ పంచుకుని ముందుకు సాగారు. ఈ జంట నిర్విరామంగా శ్రమించి మెరుగైన సర్చ్ ఇంజిన్ కోసం ఒక నమూనాను అభివృద్ధి చేసినట్లు తమ బ్లాగ్ లో వివరించారు. ” ఈ ప్రాజెక్ట్‌లో వారు అర్ధవంతమైన పురోగతిని సాధించడం మొదలు పెట్టారు. దీంతో ఈ ఆపరేషన్‌ను మరింత వేగవంతం చేసేందుకు గూగుల్ Google మొదటి కార్యాలయాన్ని అద్దెకు తీసుకున్నారు. ఈ గ్యారేజీలోనే సెప్టెంబర్ 27, 1998న, Google Inc. అధికారికంగా జన్మించింది.

సమాచారాన్ని అందించడమే లక్ష్యంగా..

ఇదే అదునుగా భావించిన ఈ టెక్ దిగ్గజం 1998 నుంచి తన నైపుణ్యాభివృద్దిని మెరుగుపరుచుకుంటూ వచ్చింది. ఈ విషయాన్ని పాతికేళ్ల ప్రస్థానం సందర్భంగా ప్రత్యేకంగా చెప్పుకొచ్చించి. అయితే ప్రపంచలోని మొత్తం సమాచారాన్ని ఆర్గనైజ్ చేయడం అంటే అది మామూలు విష‍యం కాదు. దీనికోసం ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ ను, ప్రోగ్రామింగ్ ను రూపొందించింది. ఈ సంగ్రహించిన డేటా మొత్తాన్ని విశ్వవ్యాప్తంగా అవసరమైన వారికి అందజేస్తూ పదిమందికి ఉపయోగకరంగా ఉంటేలా ప్రణాళికలు రచించింది. గత 25 సంవత్సరాలుగా మాతో కలిసి మా అభివృద్ధిలో భాగస్వామ్యం అయినందుకు మీద్వారా మేము మరింత అభివృద్ది చెందుతున్నందుకు వినియోగదారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. భవిష్యత్తులో మరింత గొప్పగా విజయాన్ని సాధించేందుకు మీ సహకారం అవసరమని ఒక సందేశాన్ని జోడించింది.

గూగుల్ ప్రస్తుత CEO సుందర్ పిచాయ్, గత నెలలో తన కంపెనీ పుట్టినరోజు గురించి ఒక గమనికను రాశారు. ఇందులో ఈ సంస్థ ప్రయాణం, సాంకేతిక పరిజ్ఞానాన్ని మార్చడంలో దాని పాత్రతో పాటూ భవిష్యత్తు వైపు తమ మార్గాన్ని ఎలా తీసుకెళ్లబోతున్నామో అన్న దాని గురించి వివరించారు. గూగుల్ విజయంలో భాగమైన వినియోగదారులు, ఉద్యోగులు, భాగస్వాములకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నూతన ఆవిష్కరణలకు నిరంతరం సవాలు విసురుతున్నందుకు ప్రస్తుత గూగ్లర్ల అంకితభావానికి ప్రశంసల వర్షం కురిపించారు.

T.V.SRIKAR