Movie Ticket Price: మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ. 99 కే సినిమా చూసే అవకాశం.. ఎప్పుడో తెలుసా..?

సినిమా అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. వీకెండ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని కళ్ళలో ఒత్తులేసుకుని మరీ సినిమాల కోసం వేచి ఉంటారు. ఈ క్రమంలో మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అక్టోబర్ 13న జాతీయ సినిమా దినోత్సవంగా ప్రకటించింది. ఈ సందర్భంగా మల్టీప్లెక్స్ థియేటర్లలో కేవలం రూ. 99 కే సినిమా చూసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది.

  • Written By:
  • Publish Date - October 12, 2023 / 01:24 PM IST

వినోదాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి. ఒకవైపు వారం మొత్తం పని ఒత్తిడి, మరో వైపు వారాంతం సెలవు. ఇంతకన్నా వేరే సమయం దొరుకుతుందా వినోదాన్ని ఆస్వాదించడానికి. అందుకే అక్టోబర్ 13న చాలా సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఆన్లైన్లో బుకింగ్ చేసుకోండి. సినిమా అంటే ప్రస్తుతం మల్టీప్లెక్స్ థియేటర్లలో వందల్లో ఖర్చవుతుంది. అదే ఫ్యామిలీ మొత్తం కలిసి వినోదాన్ని ఆస్వాదిస్తే వేల రూపాయలు ఖర్చు అవుతాయి. అయితే జాతీయ సినిమా దినోత్సవం‎ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రదాన నగరాల్లోని మల్టీప్లెక్స్ సినిమా హాళ్లలో ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే ఎంపిక చేసిన థియేటర్లలో మాత్రమే రూ. 99కి సినిమా చేడవచ్చని పేర్కొంది. దీనికోసం సుమారు దేశ వ్యాప్తంగా 4వేల స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. గత వారం విడుదలై ఆడుతున్న సినిమాలతో పాటూ రేపు విడుదలయ్యే సినిమాలకు కూడా ఈ ఆఫర్ వర్తించనున్నట్లు ఎంఏఐ ప్రెసిడెంట్ తెలిపారు. ఈ ఒక్కరోజు మాత్రమే ఈ ప్రత్యేక ఆఫర్ అమలులో ఉంటుందని కమల్ జియాన్ చందానీ చెప్పారు.

ఈ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తొలిసారిగా జాతీయ సినిమా దినోత్సవాన్ని 2022లో ప్రారంభించింది. గతంలో ఈ ఈవెంట్ కి సంబంధించి సెప్టెంబర్ 16వ తేదీని ప్రతిపాదించగా దానిని కొందరు తిరస్కరించారు. ఆ తరువాత సెప్టెంబర్ 23గా ప్రకటించారు. అయితే చివరకు అక్టోబర్ 13ను ఫైనల్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 23న జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా 6.5 మిలియన్ల మంది సినిమాను థియేటర్లకు వెళ్లి వీక్షించినట్లు అప్పటి గణాంకాలను వెల్లడించారు.

T.V.SRIKAR