శివసేన పార్టీలోని ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకొని, శివసేన పార్టీని రెండుగా చీల్చిన షిండేకి ఇప్పుడు అదే పార్టీ ఎమ్మెల్యేల వల్ల పెద్ద చిక్కు వచ్చి పడినట్లు తెలుస్తుంది. బీజేపీతో అంటకాగలేకపోతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా దాదాపు 22 మంది ఎమ్మెల్యేలతో పాటూ 9 మంది ఎంపీలు పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు ఉద్దేవ్ ఠాక్రే ఆధ్వర్యంలో శివసేన పార్టీ కి చెందిన యూబీటీ కి చెందిన సామ్నా పత్రిక ఈ కీలక విషయాలను వెల్లడించింది. ఇప్పుడు ఈ అంశం మహారాష్ట్ర లోనే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా కర్ణాటక ఓటమి నుంచి కోలుకోక ముందే మరాఠా దేశాన ఇలాంటి రాజకీయం ప్రకంపనలు రావడం పెద్ద చర్చకు దారితీస్తుంది.
ఏక్ నాథ్ షిండే వర్గంలో కొంతమంది ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నట్లు యూబీటీ ఎంపీ వినాయక్ రౌత్ తెలిపారు. ఆ పార్టీలోని రాజకీయాలు తట్టుకోలేక పోతున్నమని అందుకే పార్టీని వీడి బయటకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నారని వారు తెలిపినట్లు చెప్పారు. బీజేపీ – షిండే కూటమికి చెందిన ఎమ్మెల్యే గజానన్ కీర్తికార్ పబ్లిక్ గా కీలక వ్యాఖ్యలు చేసినట్లు సామ్నా పత్రిక పేర్కొంది. ఎన్డీయే పొత్తులో ఎలాంటి అభివృద్ది జరగలేదన్నట్లు ఈ శాశన సభ్యుడు తెలిపినట్లు ప్రచురించింది. తాము 13 మంది ఎమ్మెల్యేలము ఉన్నామని.. బీజేపీ – షిండే తో కలిసి అధికారంలో ఉండటం వల్ల తమ ప్రాంత సమస్యలు పరిష్కారం కావడంలేదని గజానన్ గతంలో ఒకసారి బహిరంగంగా అన్నారు.
‘వ్యక్తిగత గౌరవాన్ని డబ్బులు ఆశ చూపించి కొనలేరని మరోసారి రుజువైనట్లు తేలింది’. ఈసారి 22 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తాం అని షిండే నేతృత్వంలోని ఉద్దేవ్ ఠాక్రే పార్టీకి చెందిన నేతలే అంటున్నారు. ఇలాగే కొనసాగితే ఎన్టీయే తో పొత్తులో ఉన్న ఏక్ నాథ్ షిండే వర్గానికి రానున్న ఎన్నికల్లో 22 సీట్లు ఇచ్చే అవకాశాన్ని చేజార్చుకున్నట్లే అని సామ్నా పత్రిక తెలిపింది.
T.V.SRIKAR