Operation Cheetah success : శంషాబాద్ లో ఆపరేషన్ చిరుత సక్సెస్.. నల్లమల్ల ఫారెస్ట్ కు చిరుత తరలింపు..

శంషాబాద్ విమానాశ్రయంలోకి వచ్చిన చిరుత గత ఐదు రోజులుగా ఎయిర్ పోర్ట్ అధికారులను ముప్పతిప్పలు పెట్టిన విషయం తెలిసిందే.. కాగా ఎట్టకేలకు ఆపరేషన్ చిరు సక్సెస్ అయ్యింది.

శంషాబాద్ విమానాశ్రయంలోకి వచ్చిన చిరుత గత ఐదు రోజులుగా ఎయిర్ పోర్ట్ అధికారులను ముప్పతిప్పలు పెట్టిన విషయం తెలిసిందే.. కాగా ఎట్టకేలకు ఆపరేషన్ చిరు సక్సెస్ అయ్యింది. ఇవాళ తెల్లవారు జామున చిరుత కోసం బోనులో ఎరగా వేసిన మేక పిల్లను తినడానికి వచ్చి తెల్లవారు జామున 2.15గంటల సమయంలో బోనులో చిక్కిందని అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియల్ తెలిపారు. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు, అటవీశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

గత నెల 28న తెల్లవారు జామున గొల్లపల్లి నుంచి ప్రహరీగోడ దూకి చిరుత శంషాబాద్ విమానాశ్రయం లోపలికి వచ్చింది. ప్రహరీ దూకుతుండగా ఎలక్ట్రిక్ ఫెన్షింగ్ వైర్లకు తగలడంతో ఎయిర్ పోర్ట్ కంట్రోల్ రూంలో అలారం మోగింది. CCTV కెమారాలో చూడాగా ఎయిర్ పోర్టులోకి చిరుత ప్రవేశించినట్లు అధికారులు గుర్తించారు. అప్పటి నుంచి అటవీశాఖ సిబ్బంది చిరుత కోసం గాలింపు చేస్తున్నారు.

దీన్ని పట్టుకోవడానికి ఐదు బోన్లు, 20 కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ చిరుతను నెహ్రూ జూ పార్కుకు తరలించనున్నారు. జూలో చిరుత ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి.. అక్కడి నుంచి తెలంగాణలోని అమ్రాబాద్ నల్లమల్ల టైగర్ రిజర్ ఫారెస్ట్ కు చిరుతను తరలించనున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.

SSM