సరిగా వారం రోజుల నుంచి మూడు రాష్ట్రాల ప్రభుత్వాలకు చుక్కలు చూపిస్తున్న తుంగభద్ర గేటు అమరిక వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. నిన్న సాయంత్రం చీకటి పడిన తర్వాత మొదటి స్టాప్ లాగ్ ఏర్పాటు చేసిన అధికారులు.. నేడు దాదాపుగా వృధాగా పోతున్న నీటిని కట్టడి చేసారు. తుంగభద్ర డ్యాం 19వ క్రస్ట్ గేట్ నుంచి నీటిని అదుపులోకి తీసుకురావడంలో ఇరిగేషన్ నిపుణులు విజయవంతం అయ్యారు.
తుంగభద్ర డ్యాం 19వ క్రస్ట్ గేట్ స్థానంలో స్టాప్ లాగ్ గేట్లను విజయవంతంగా ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. ఏర్పాటు విజయవంతంగా కొనసాగుతుంది. మూడవ స్టాప్ లాగ్ ను కూడా విజయవంతంగా ఏర్పాటు చేసారు. మరో రెండు స్టాప్ లాగ్ లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మూడవ స్టాప్ లాగ్ గేట్ ఏర్పాటుతో తుంగభద్ర డ్యాం నుంచి దిగువకు ప్రవహిస్తున్న నీటిని సిబ్బంది దాదాపుగా కట్టడి చేసారు. ఈ నెల 10 నుంచి నీరు వృధాగా పోతుంది. నీరు వృధాగా పోయినా ఆందోళన అవసరం లేదని, మరో వారం రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.