Telangana Liquor : మన వాళ్ళు ఫుల్లుగా తాగేస్తున్నారు.. బీరు కొట్టడం లో మనమే టాప్..

తెలంగాణ ముందు నుంచే బీర్ మార్కెట్ అని చెబుతున్నాయి ఎక్సైజ్ శాఖ లెక్కలు. హైదరాబాద్ లో ఐటీ ఇండస్ట్రీతో పాటు అన్ని రాష్ట్రాలకు చెందిన యువత ఇక్కడికి ఉద్యోగాల కోసం వస్తుండటం వారెక్కువగా బీర్ కు ఫ్రెఫరెన్సె ఇవ్వడం వంటి కారణాలు బీర్ సేల్స్ అధికంగా ఉండటానికి కారణమని చెబుతున్నారు ఎక్సైజ్ నిపుణులు. ఇక లిక్కర్ సేల్స్ రాష్ట్రంలో కాస్త తక్కువగానే ఉంటాయని చెబుతున్నారు. రాష్ట్రంలో సగటున నెలకు నలభై లక్షల కేసుల బీర్లు అమ్మకాలు జరిగితే.. ముప్పై లక్షల కేసుల లిక్కర్ సేల్స్ అమ్ముడవుతాయని అంటున్నారు.

మందు తాగడం లో తెలంగాణ మందుబాబులు టాప్ లో ఉన్నారు. బీర్ల అమ్మకాల్లో తెలంగాణ ముందుంది. మందుబాబులు ఎక్సైజ్ ఖజానాను పెంచుతున్నారు. తెలంగాణ మందుబాబుల రికార్డు క్రియేట్ చేస్తున్నారు. దక్షిణ భారత దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటే తాగుడులో తెలంగాణను టాప్ లో నిలిపారు. రాష్ట్రంలో గతేడాది దాదాపు తొమ్మిది లీటర్ల లిక్కర్లు, దాదాపు పదకొండు లీటర్ల బీరు ఉంది. ఇది లిక్కర్ సేల్స్, వినియోగంపై ఇటీవల ఎక్సైజ్ డిపార్ట్‌‌మెంట్ నివేదికలో వెల్లడయ్యింది. గతంలో తెలంగాణ కంటే ఏపీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో లిక్కర్ వినియోగం అధికంగా ఉంటుంది. కానీ ప్రస్తుతం తెలంగాణ వాటిని అధిగమించింది.

తెలంగాణ కంటే ఏపీ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో జనాభా ఎక్కువగా ఉంది.. అయినప్పటికీ లిక్కర్, బీర్ల వినియోగం తక్కువగా ఉందని లెక్కలు చెబుతున్నాయి. దక్షిణ రాష్ట్రాల్లో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అధిక మద్యం అమ్మకాలు జరిగేవి.. ఆ తరువాత తెలంగాణ ఉంటుంది. అయితే ప్రస్తుతం సేల్స్ పరంగా తెలంగాణ ముందున్న కూడా ఆదాయం పరంగా తమిళనాడు ముందుంది. ఎందుకంటే తమిళనాడు లో మద్యం ధరలు ఎక్కువగా ఉండటమే. గత 2022–23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో రూ.33,268 కోట్లు, ఏపీలో రూ.23,804 కోట్లు, కర్ణాటకలో రూ.29790 కోట్లు, కేరళలో రూ.16,189 కోట్ల ఆదాయం సమకూరినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.

తెలంగాణ ముందు నుంచే బీర్ మార్కెట్ అని చెబుతున్నాయి ఎక్సైజ్ శాఖ లెక్కలు. హైదరాబాద్ లో ఐటీ ఇండస్ట్రీతో పాటు అన్ని రాష్ట్రాలకు చెందిన యువత ఇక్కడికి ఉద్యోగాల కోసం వస్తుండటం వారెక్కువగా బీర్ కు ఫ్రెఫరెన్సె ఇవ్వడం వంటి కారణాలు బీర్ సేల్స్ అధికంగా ఉండటానికి కారణమని చెబుతున్నారు ఎక్సైజ్ నిపుణులు. ఇక లిక్కర్ సేల్స్ రాష్ట్రంలో కాస్త తక్కువగానే ఉంటాయని చెబుతున్నారు. రాష్ట్రంలో సగటున నెలకు నలభై లక్షల కేసుల బీర్లు అమ్మకాలు జరిగితే.. ముప్పై లక్షల కేసుల లిక్కర్ సేల్స్ అమ్ముడవుతాయని అంటున్నారు.

నల్గొండ, కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో అధికంగా లిక్కర్ సేల్స్ జరుగుతాయి. రాష్ట్రంలో అధిక సేల్స్ జరగడానికి మద్యం ధరలు కూడా కారణమే. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మద్యం ధరలు కొంత బెటర్ గా ఉన్నాయని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు.
రాష్ట్ర ప్రభుత్వం బెల్ట్ షాప్స్ నియంత్రణ పై దృష్టి పెట్టింది. ఇది అధిక ధరలకు మద్యం అమ్మకాలు.. కల్తీ వంటివి తగ్గే అవకాశాలు ఉంటాయని.. బెల్ట్ షాప్స్ పై నియంత్రణ పెట్టడం అనేది మంచి నిర్ణయమే అని చెబుతున్నాయి ఎక్సైజ్ వాలు.