PV Narasimha Rao : భారత్ కీర్తిని పీవీ ప్రపంచానికి చాటి చెప్పారు : సీఎం రేవంత్ రెడ్డి

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 19వ వర్ధంతి వేళ హైదరాబాద్‌లోని 'పీవీ జ్ఞానభూమి' వద్ద రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సహా మంత్రులు, పీవీ కుటుంబ సభ్యులు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్‌ నేతలు పీవీకి అంజలి ఘటించారు. పీవీ నరసింహారావుకు నివాళి అర్పించిన రేవంత్ రెడ్డి. అనంతరం పీవీని గుర్తు చేసుకున్నారు రేవంత్​ రెడ్డి.

 

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 19వ వర్ధంతి వేళ హైదరాబాద్‌లోని ‘పీవీ జ్ఞానభూమి’ వద్ద రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సహా మంత్రులు, పీవీ కుటుంబ సభ్యులు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్‌ నేతలు పీవీకి అంజలి ఘటించారు. పీవీ నరసింహారావుకు నివాళి అర్పించిన రేవంత్ రెడ్డి. అనంతరం పీవీని గుర్తు చేసుకున్నారు రేవంత్​ రెడ్డి. పీవీ దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి అని కీర్తించారు. ఆయన పరిపాలనలో మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచారన్నారు. దేశాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి పీవీ చేసిన సంస్కరణలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గుర్తు చేసుకున్నారు.

“బంగారాన్ని కుదవ పెట్టి అప్పులు తేవడంపై ఆయన ఒకే మాట చెప్పారు. తెలివైన వాడు సగం ఆస్తిని కుదవపెట్టి అయినా సరే మిగతా ఆస్తిని కాపాడుకుంటారని ఆయన చెప్పారు” అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి పీవీ నరసింహా రావు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పీవీ నరసింహారావు భూమిని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చారు. పేదలకు భూములు పంచడానికి పీవీ బలమైన పునాదులు వేశారని కోనియాడారు.

పీవీ మన మధ్య లేకపోయినా వారి సంస్కరణలు సదా ఆచరణీయం అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాగా హుస్సేన్ సాగర్ తీరంలో ఉన్న పీవీ ఘాట్, జైపాల్ రెడ్డి ఘాట్ లను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వీరిద్దరూ తెలంగాణకు లంకె బిందెల్లాంటి వారని రేవంత్ రెడ్డి అన్నారు. ఇక వారి అడుగు జాడల్లో.. వారి కీర్తిని మరింత పెంచేలా తమ ప్రభుత్వం పని చేస్తుందని రేవంత్​ రెడ్డి భరోసా ఇచ్చారు.