ఐపీఎల్ వేలంలో అన్ సోల్డ్, ఆటకు గుడ్ బై చెప్పిన పేసర్

ఐపీఎల్ మెగావేలంలో అన్ సోల్డ్ గా మిగిలిపోయిన పేస్ బౌలర్ సిద్ధార్ధ్ కౌల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు.

  • Written By:
  • Publish Date - November 29, 2024 / 08:15 PM IST

ఐపీఎల్ మెగావేలంలో అన్ సోల్డ్ గా మిగిలిపోయిన పేస్ బౌలర్ సిద్ధార్ధ్ కౌల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు. ఒకప్పుడు టీమిండియాకు ఆడిన ఈ స్టార్ పేసర్ సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ తో క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. కౌల్ భారత్ తరఫున మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాడు. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్ డెవిల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. 34 ఏళ్ల ఈ స్టార్ పేసర్ 54 ఐపీఎల్ మ్యాచుల్లో 58 వికెట్లు పడగొట్టాడు. సిద్ధార్థ్ దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణించాడు. పంజాబ్ చెందిన ఈ పేసర్ 88 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 297 వికెట్లు పడగొట్టాడు. 111 లిస్ట్ ఏ మ్యాచ్ లలో 199 వికెట్లు పడగొట్టాడు. 145 టీ20 మ్యాచ్ లలో 182 వికెట్లు పడగొట్టాడు. 2008లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సిద్ధార్థ్ కౌల్ ప్లేయర్ గా ఉన్నాడు.