Chiranjeevi  Padma Vibhushan award  : మెగాస్టార్‌కు పద్మవిభూషణ్‌..

మెగా అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ తరుణం రానేవచ్చింది. అభిమానులందరి అన్నయ్య, స్టార్లకే స్టార్‌.. మెగాస్టార్‌ (MegaStar)ను పద్మ విభూషణ్‌ (Padma Vibhushan) అవార్డ్‌ (award) వరించింది. మెగాస్టార్‌కు పద్మ విభూషన్‌ అవార్డ్‌ ఇస్తున్నట్టు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.

 

మెగా అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ తరుణం రానేవచ్చింది. అభిమానులందరి అన్నయ్య, స్టార్లకే స్టార్‌.. మెగాస్టార్‌ (MegaStar)ను పద్మ విభూషణ్‌ (Padma Vibhushan) అవార్డ్‌ (award) వరించింది. మెగాస్టార్‌కు పద్మ విభూషన్‌ అవార్డ్‌ ఇస్తున్నట్టు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ప్రతీ ఏడాది రిపబ్లిక్‌ డేకు ఒక రోజు ముందు.. అంటే జనవరి 25న పద్మ అవార్డులను ప్రకటిస్తుంటారు. ఈ ఏడాది కూడా పద్మ పురస్కారాలకు ఎంపికైనవాళ్ల పేర్లు ప్రకటించారు. ఇందులో భాగంగా చిరంజీవికి పద్మ విభూషణ్‌ అవార్డ్‌ ప్రకటించింది ప్రభుత్వం. చిరంజీవికి ఈ అవార్డ్‌ రాబోతోదంటూ కొన్ని రోజుల నుంచి ఇంటర్నెట్‌లో వార్తలు చక్కర్లు కొడుకుతున్నాయి. కానీ ఎక్కడా అధికారిక ప్రకటన లేదు. దీంతో ఈ విషయంలో కాస్త డైలమా ఏర్పడింది. ఇప్పుడు ప్రభుత్వం స్వయంగా చిరంజీవి పేరు ప్రకటించడంతో మెగా ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు.

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్‌ (NTR), ఏఎన్నార్‌(ANNR), కృష్ణ(Krishna), శోభన్‌బాబు (Shobhan Babu) లాంటి హీరోల త్వరాత స్వయంకృషితో ఎదిగిన ఏకైక నటుడు చిరంజీవి. ఆయనతో పాటు ఎంతో మంది స్టార్స్‌ అదే సమయంలో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు చిరంజీవి. ఆకాశమంతటి ఇమేజ్‌తో మెగాస్టార్‌గా ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు. తన సెకండ్‌ ఇన్నింగ్స్‌లో కూడాక నేటి తరం హీరోలకు పోటీ ఇచ్చాడంటే.. మెగాస్టార్‌ రేంజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనే మాటకు పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ చిరంజీవి. ఇంత స్టార్‌డం ఉన్నా.. ఇప్పటికీ సినిమాల విషయంలో ఆయన చూపించే డెడికేషన్‌ ఇవాళ ఆయనకు ఈ అవార్డ్‌ తెచ్చిపెట్టింది. 150కి పైగా సినిమాలు తీసిన చిరంజీవి తన జీవిత ప్రస్థానంలో ఎన్నో అవార్డులు అందుకున్నారు. 1982లో శుభలేఖ అనే సినిమాకు మొదటి ఫిల్మిం ఫేర్‌ అవార్డ్‌ అందుకున్నారు. 1983లో వచ్చిన ఖైదీ సినిమా.. నార్మల్‌ స్టార్‌గా ఉన్న చిరంజీవిని మెగాస్టార్‌ని చేసింది. ఆ సినిమాకు కూడా చిరంజీవికి అవార్డు వచ్చింది. అక్కడ మొదలైన ఆయన అవార్డుల ప్రస్థానం నేడు దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారంగా భావించే పద్మ విభూషణ్‌ వరకూ చేరింది. 40 ఏళ్ళకు పైబడ్డ నట ప్రస్థానంలో.. మూడు సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు, రఘుపతి వెంకయ్య బహుమతి, తొమ్మిది ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డులు గెలుచుకున్నాడు.

2006 లో చిరంజీవికి చలన చిత్ర రంగంలో చేసిన సేవలకు గాను పద్మభూషణ్ అవార్డ్ లభించింది. అదే సంవత్సరం ఆంధ్ర విశ్వవిద్యాలయం చిరంజీవికి గౌరవ డాక్టరేట్‌ కూడా ఇచ్చింది. కానీ ఈ అవార్డులు, రివార్డులన్నీ ఆయనకున్న అభిమాన బలం ముందు పెద్దగా కనిపించవు. ఇండియా వైడ్‌గా మెగాస్టార్‌కు 3 వేలకు పైగా అభిమాన సంఘాలున్నాయని ఒక అంచనా. అంతటి అభిమాన బలం ఉంది కాబట్టే ఇప్పటికీ ఆయన మెగాస్టార్‌గా కొనసాగుతున్నారు. ఒక సామాన్యుడిగా సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి.. అంచలంచలుగా పద్మ విభూషణ్‌ వరకూ ఎదిగిన మెగాస్టార్‌ తన జీవితంలో ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశిస్తూ.. డయల్‌ న్యూస్‌ తరఫున కంగ్రాచ్యులేషన్స్‌ మెగా స్టార్‌.