హిపోక్రసీని నరనరానా ఎక్కించుకున్న మనషుల మధ్య జీవిస్తున్నాం..ఈ హిపోక్రైట్‌లు కేవలం మనదేశంలోనే ఉంటారనుకుంటే పొరపాటే..ప్రపంచం నలుమూలలా ఉంటారు..మన దగ్గర కూడా ఉంటారు.. అగ్రరాజ్యల్లోనూ ఉంటారు. పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ఇదే విషయాన్ని చెప్పాలనుకున్నాడు.. చెప్పేశాడు.. పాకిస్థాన్ సింధ్ ప్రావిన్స్‌లో 150 ఏళ్ల నాటి హిందూ దేవాలయాన్ని కూల్చివేసిన రెండు రోజుల తర్వాత కనేరియా ఈ ఘటనపై స్పందించాడు. పాక్‌లో దేవాలయాల కూల్చివేతపై అంతర్జాతీయ సమాజం మౌనం వహించడాన్ని ప్రశ్నించారు.
పాక్ తరఫున క్రికెట్ ఆడిన రెండో హిందూ ప్లేయర్ కనేరియా. అక్కడ మైనారిటీలపై జరిగే దాడులను ఎప్పటికప్పుడు ఖండిస్తూ ఉంటాడు కనేరియా. నిజానికి కనేరియా హిందూ కావడంతోనే అతని కెరీర్ ఎదగనివ్వకుండా తొక్కేశారన్న ప్రచారముంది. టాలెంటడ్ స్పిన్నరైనా కనేరియా పాక్ క్రికెట్‌కు ఆడినన్ని రోజులు అద్భుతమైన విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అటు సమాజంలో జరిగే వాటిపైనా ఎంతో దైర్యంగా ముందుకొచ్చి మాట్లాడే తెగింపు కనేరియాది. అందుకే అతన్ని ప్రేమించేవాళ్ల సంఖ్య పాక్‌లో చాలా తక్కువ. అయినా కానీ కనేరియా అవేవి పట్టించుకోడు. అందుకే హిందూ దేవలయాల కూల్చివేతపై యావత్ ప్రపంచం సైలెంగ్‌గా ఉన్న సమయంలో తన వాయిస్ వినిపించాడు కనేరియా.
కాష్‌మోర్ ప్రాంతంలోని ఓ ఆలయంపై దుండగులు రాకెట్ లాంచర్లతో దాడి చేయడాన్ని కనేరియా ఖండించారు. పక్కనే ఉన్న హిందువుల ఇళ్లపై కూడా దాడి చేసినట్టు విమర్శలు గుప్పించాడు. పాకిస్థాన్‌లో మతమార్పిడి, కిడ్నాప్, అత్యాచారం, హత్య లాంటి లెక్కలేనన్ని దారుణాలు ప్రతిరోజూ జరుగుతున్నాయని కనేరియా ఆరోపించారు. పాక్‌లో అసలు మత స్వేచ్ఛ లేదంటూ నిజాన్ని నిక్కచ్చిగా చెప్పేశాడు ఈ డాషింగ్ స్పిన్నర్. కనేరియా విమర్శల్లో ఎంతో హేతుబద్ధత ఉందంటున్నారు నెటిజన్లు. ముస్లింలు లేదా..మసీద్‌లపై దాడులను ప్రపంచం ఖండిస్తుందని..అదే హిందూలపై అణచివేత ప్రదర్శించే ఘటనల విషయంలో మాత్రం మేధావులు ఎందుకు సైలెంట్‌గా ఉంటారో అర్థంకాదంటూ మండిపడుతున్నారు. ఒక్కొ మతానికి ఒక్కొ న్యాయం ఉండదు కదా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పాక్‌లో హిందూ దేవలయాలపై దాడులు జరగడం ఇదేమీ కొత్త కాదు.. దశబ్దాలుగా అక్కడ జరుగుతున్నదదే..అయితే పట్టించుకునే నాథుడే ఉండడు.. కనీసం ప్రశ్నించే వాళ్లు కూడా ఉండరు.