Imran Khan: ఇమ్రాన్‌ఖాన్‌కు షాక్.. సైఫర్ కేసులో పదేళ్ల జైలు శిక్ష..

ఇమ్రాన్‌తోపాటు ఆయన సన్నిహితుడు, మాజీ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషికి కూడా కోర్టు శిక్ష విధించింది. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్.. తోషాఖానా కేసులో శిక్ష అనుభవిస్తూ, రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు.

  • Written By:
  • Publish Date - January 30, 2024 / 03:42 PM IST

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు షాక్ తగిలింది. సైఫర్ కేసులో ఇమ్రాన్‌కు స్పెషల్ కోర్టు.. పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఇమ్రాన్‌తోపాటు ఆయన సన్నిహితుడు, మాజీ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషికి కూడా కోర్టు శిక్ష విధించింది. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్.. తోషాఖానా కేసులో శిక్ష అనుభవిస్తూ, రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు. ఈ కేసులో ఇమ్రాన్‌కు విధించిన శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు ఇటీవల నిలిపివేసింది. ఆ వెంటనే ఆయనను సైఫర్ కేసులో అరెస్టు చేసింది ప్రభుత్వం.

TOLLYWOOD DRUGS CASE: టాలీవుడ్‌కు చుట్టుకుంటున్న డ్రగ్స్‌ కేసు.. లావణ్య చాటింగ్‌ లిస్ట్‌లో సంచలన పేర్లు..

ఈ కేసులో పాక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చార్జిషీట్ దాఖలు చేసింది. ప్రత్యేక భద్రతా కారణాలరీత్యా జడ్జి అబ్దుల్ హస్నత్.. జుల్కర్నైన్ జైలులోనే విచారణ చేపట్టారు. అనంతరం ఇమ్రాన్‌ ఖాన్‌కు, ఖురేషికి పదేళ్ల జైలు శిక్ష విధించారు. రెండేళ్లక్రితం.. పాక్ ప్రధానిగా ఉన్నారు ఇమ్రాన్ ఖాన్. ఈ సమయంలో తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అగ్రదేశం అమెరికా కుట్ర చేస్తోందంటూ ఇమ్రాన్ ఆరోపించారు. దీనికి సంబంధించి కొన్ని పత్రాల్ని ఆయన చూపించారు. అవి అమెరికాలోని పాక్ రాయబార కార్యాలయం నుంచి వచ్చిన పత్రాలు. నిజానికి అవి చాలా రహస్య పత్రాలు. వాటిని పాక్ ఎంబసీ నుంచి ఇమ్రాన్ ప్రభుత్వం సేకరించింది. అయితే, అలాంటి రహస్య పత్రాల్ని బహిరంగంగా ప్రదర్శించడాన్ని సవాలు చేస్తూ.. ఆయనపై సైఫర్ కేసు నమోదైంది. అంటే.. ఇది అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కిందికి వస్తుంది. ఈ నిబంధన ఉల్లంఘించిన కారణంగా ఇమ్రాన్, ఖురేషిపై కేసు నమోదు చేసి, విచారణ జరిపారు.

తాజాగా దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఇమ్రాన్ ఖాన్‌కు, ఖరేషీకి పదేళ్ల జైలు శిక్షు ఖరారు చేసింది. అయితే, ఈ తీర్పును ఇద్దరూ పై కోర్టుల్లో సవాలు చేసుకునే వీలుంది. ఇమ్రాన్ ఖాన్‌పై ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి. 2022లో ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ఈ తీర్మానంలో ఆయన ప్రభుత్వం ఓడిపోయింది. దీంతో ఆయన తన పదవిని వీడాల్సి వచ్చింది. అనంతరం వివిధ కేసులకింద ఇమ్రాన్‌ను ప్రభుత్వం అరెస్టు చేసింది. ఇప్పటివరకు ఇమ్రాన్‌పై దాదాపు 150 కేసులున్నట్లు అంచనా.