ప్రభాస్ మూవీలో పాక్‌ హీరోయిన్‌.. ఈ అందం గురించి తెలిస్తే..

బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో ప్రభాస్ తీసుకుపోతున్నాడ్. కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్.. ఇప్పుడు రాజాసాబ్ సినిమాతో రాబోతున్నాడు. ఈ మూవీ తర్వాత సీతారామం డైరెక్టర్‌ హను రాఘవపూడితో సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ పూజా కార్యక్రమం.. లాంచనంగా ప్రారంభమైంది.

  • Written By:
  • Updated On - August 17, 2024 / 06:23 PM IST

బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో ప్రభాస్ తీసుకుపోతున్నాడ్. కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్.. ఇప్పుడు రాజాసాబ్ సినిమాతో రాబోతున్నాడు. ఈ మూవీ తర్వాత సీతారామం డైరెక్టర్‌ హను రాఘవపూడితో సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ పూజా కార్యక్రమం.. లాంచనంగా ప్రారంభమైంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీ ఓపెనింగ్‌లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచిందో అందం. తనే ప్రభాస్ హీరోయిన్. అయితే ఇంతకు ముందెప్పుడూ చూసిన ఫేస్ కాదు. వేరే భాషల్లో కూడా నటించినట్టు లేదు.

అందుకే ఎవరికీ పెద్దగా తెలియలేదు. ఈ ఓపెనింగ్ తర్వాత అమ్మడి గురించి ఆరా తీస్తే తన పేరు ఇమాన్వి అని తేలింది. పేరును బట్టి ముస్లీం అని తెలుస్తోంది కదా. అంతే కాదు.. తను పాకిస్తాన్‌లో పుట్టిన అమ్మాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరికి ఛాన్స్ వస్తుందా అని అంతా ఎదురుచూస్తోంటే అందరికీ షాక్ ఇస్తూ హను రాఘవపూడి ఈ కొత్తమ్మాయిని తీసుకువచ్చాడు. ఫస్ట్ మూవీతోనే ప్యాన్ ఇండియా ఆడియన్స్ కు పరిచయం అయ్యే అదృష్టం ఇమాన్వికి దక్కింది.

ఇమాన్వి ఇన్ స్టాగ్రామ్ చూస్తే అమ్మడు అద్భుతమైన డ్యాన్సర్ అని తెలిసింది. తను ఫ్లోర్ పై మూమెంట్స్ ఇస్తుంటే హోరెత్తిపోతోంది. ఓపెనింగ్ రోజున చీరకట్టులో సంప్రదాయంగా కనిపించిన తనలో ఇంత గ్రేట్ డ్యాన్సర్ ను చూసి ఆశ్చర్యపోతున్నారంతా. ప్రేమమ్ సినిమాలో సాయి పల్లవి సడెన్ గా డ్యాన్స్ వేస్తే ఎలా షాక్ అయ్యారో అచ్చం అలా అన్నమాట. హైలైట్ ఏంటంటే.. తను మంచి కొరియోగ్రాఫర్ కూడా. సినిమాలో పాత్ర ఎలా ఉంటుందో కానీ చూస్తుంటే హుషారైన పిల్లలా ఉంది. మరి ఈ బ్యూటీ ఈ మూవీతో ఎలాంటి స్థాయికి చేరుతుందో చూడాలి మరి.