Pakistan : ప్యాడ్లు లేకుండా పాక్ ప్లేయర్ కామెడీ..

పాకిస్తాన్‌ స్టార్‌ బౌలర్‌ హరీస్‌ రౌఫ్‌ మరోసారి వార్తలలో నిలిచాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌ బాష్‌ లీగ్‌ లో, మెల్‌బోర్న్‌ స్టార్స్‌ తరఫున ఆడుతున్న హరీస్‌.. శనివారం జరిగిన మ్యాచ్‌లో కాళ్లకు ప్యాడ్స్‌, తలకు హెల్మెట్‌, చేతులకు గ్లవ్స్‌ లేకుండానే క్రీజులోకి వచ్చాడు. అయితే అంపైర్‌ అందుకు అంగీకరించలేదు. కాళ్లకు ప్యాడ్స్‌ లేకుండా నాన్‌ స్ట్రయికర్‌ ఎండ్‌లో ఉన్న హరీస్‌ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌‌గా మారింది.

పాకిస్తాన్‌ స్టార్‌ బౌలర్‌ హరీస్‌ రౌఫ్‌ మరోసారి వార్తలలో నిలిచాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌ బాష్‌ లీగ్‌ లో, మెల్‌బోర్న్‌ స్టార్స్‌ తరఫున ఆడుతున్న హరీస్‌.. శనివారం జరిగిన మ్యాచ్‌లో కాళ్లకు ప్యాడ్స్‌, తలకు హెల్మెట్‌, చేతులకు గ్లవ్స్‌ లేకుండానే క్రీజులోకి వచ్చాడు. అయితే అంపైర్‌ అందుకు అంగీకరించలేదు. కాళ్లకు ప్యాడ్స్‌ లేకుండా నాన్‌ స్ట్రయికర్‌ ఎండ్‌లో ఉన్న హరీస్‌ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌‌గా మారింది. బిగ్‌ బాష్‌ లీగ్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌ వర్సెస్ సిడ్నీ థండర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో హరీస్‌ రౌఫ్‌ ఆఖరి ఓవర్లో చివరి బంతికి బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చింది.

డేనియల్‌ సామ్స్‌ వేసిన 19వ ఓవర్లో ఐదో బంతికి స్టెకెటె ఔటయ్యాక హరీస్‌ రౌఫ్‌ ఆఖరి బ్యాటర్‌గా వచ్చాడు. ఎలాగూ తాను బ్యాటింగ్‌ చేయబోయేది లేదు గనక ఇంతమాత్రానికి ప్యాడ్స్‌, గ్లవ్స్‌, హెల్మెట్‌ ఎందుకని అనుకున్నాడో గానీ ఖాళీ బ్యాట్‌ పట్టుకుని గ్రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. అయితే దీనికి ఫీల్డ్‌ అంపైర్‌ అనుమతించలేదు. బ్యాటర్‌కు కనీస రక్షణ అవసరమని అభ్యంతరం వ్యక్తం చేయడంతో హరీస్‌ ఎట్టకేలకు గ్లవ్స్‌, హెల్మెట్‌ తెచ్చుకుని నాన్‌ స్ట్రయికర్‌ ఎండ్‌లో నిలబడ్డాడు. అంపైర్ల బలవంతం మీద తలకు హెల్మెట్‌ పెట్టుకున్నా గ్లవ్స్‌ మాత్రం ధరించలేదు. కాళ్లకు ప్యాడ్స్‌ గురించి అంపైర్‌ కూడా పెద్దగా పట్టించుకోలేదు. మొదట బ్యాటింగ్‌ చేసిన మెల్‌బోర్న్‌ స్టార్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన సిడ్నీ థండర్స్‌.. 18.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.