పంత్ @ 50 సిక్సర్లు

న్యూజిలాండ్‌తో ముంబై వేదికగా జరిగిన టెస్టులో టీమిండియా బ్యాటర్ రిషభ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 50 సిక్సర్ల మార్క్‌ను అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన రెండో భారత క్రికెటర్‌గా, ఓవరాల్‌గా మూడో ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు.

  • Written By:
  • Publish Date - November 4, 2024 / 06:33 PM IST

న్యూజిలాండ్‌తో ముంబై వేదికగా జరిగిన టెస్టులో టీమిండియా బ్యాటర్ రిషభ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 50 సిక్సర్ల మార్క్‌ను అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన రెండో భారత క్రికెటర్‌గా, ఓవరాల్‌గా మూడో ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. పంత్‌ కంటే ముందు ఈ మార్క్‌ను ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, టీమిండియా సారథి రోహిత్ శర్మ సాధించారు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు 92 ఇన్నింగ్స్‌లు ఆడిన బెన్ స్టోక్స్ 81 సిక్సర్లు బాదాడు. రోహిత్ శర్మ 64 ఇన్నింగ్స్‌ల్లో 56 సిక్సర్లు బాదాడు. ఇక రిషభ్ పంత్ 51 ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీ సిక్సర్లు సాధించాడు. పంత్ తర్వాతి స్థానాల్లో యశస్వీ జైస్వాల్ , జానీ బెయిర్‌స్టో , శుభ్‌మన్ గిల్ ఉన్నారు