Parliament : నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. ప్రమాణ స్వీకారం చేయనున్నా 544 ఎంపీలు..

నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు మోదలు.. ఇవాళ నుంచి 18దో లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు 18వ లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది.

నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు మోదలు.. ఇవాళ నుంచి 18దో లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు 18వ లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ప్రధాని నుంచి కేబినెట్‌ సభ్యుల వరకు ప్రమాణ స్వీకారం చేయగా, కొత్తగా ఎన్నికైన లోక్‌సభ సభ్యుల ప్రమాణం ఇంకా జరగలేదు. కొత్తగా ఎన్నికైన ఎంపీలు లోక్‌సభ సమావేశాల మొదటి రెండు రోజులలో అంటే జూన్ 24, సోమ, 25 జూన్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. రేపు ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. తొలుత ప్రధాని నరేంద్ర మోదీతో బీజేపీ ఎంపీ ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణం చేయిస్తారు. అనంతరం కేబినెట్ మంత్రులు, స్వతంత్ర హోదా మంత్రులు, సహాయమంత్రులు ప్రమాణం పూర్తి చేస్తారు. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ఆయన ప్రమాణం చేయిస్తారు.

‘544’తో ఇదే చివరి లోక్‌సభ?

నేడు ఈ 18వ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే 544 మంది ఎంపీలతో కొలువుదీరిన ఈ సభ చివరిదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. దీంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి అందుకు అనుగుణంగా లోక్‌సభ సీట్ల సంఖ్య పెంచే ఛాన్స్ ఉంది. అప్పుడు కొత్త సంఖ్యతో సభ జరగాల్సి ఉంటుంది.

18వ లోక్‌సభలో 280 మంది కొత్తవారే!

నేడు ప్రారంభమయ్యే 18వ లోక్‌సభ సమావేశాల్లో సగానికిపైగా కొత్త ఎంపీలు పాల్గొనబోతున్నారు. మొత్తం 544 సభ్యుల్లో దాదాపు 52% అంటే 280 మంది కొత్తవారు ఎంపీలుగా సభలో అడుగుపెట్టనున్నారు. మిగిలిన వారిలో 216 మంది ఎంపీలు గత సభలో ఉన్నవారు కాగా మరికొందరు అంతకుముందు సభ్యులుగా ఎన్నికైనవారు. మొత్తం 41 పార్టీల నుంచి ఎంపీలున్నారు. సంఖ్యాపరంగా బీజేపీ(240), కాంగ్రెస్(99), సమాజ్ వాదీ పార్టీ(37) టాప్‌-3లో ఉన్నాయి.