Pavel Durov 100 Children Father : పెళ్లికాకుండా 100 మంది పిల్లల్ని కన్నాడు…

ఒక్కరు కాదు.. పది మంది కాదు.. ఏకంగా 100 మంది పిల్లలకు తండ్రయ్యాడు.. అది కూడా పెళ్ళి కాకుండానే... అతనెవరో కాదు ప్రముఖ షార్ట్ మెసేజింగ్ ప్లాట్ ఫామ్ (Messaging platform) టెలిగ్రామ్ (Telegram) సీఈఓ (CEO) పావెల్ దురోవ్ (Pavel Durov) ... స్వయంగా ఆయనే ఈ విషయాన్ని వెల్లడించి సంచలనం సృష్టించారు. తనకు 12 దేశాల్లో 100 మందికి పైగా సొంత పిల్లలున్నారని ప్రకటించారు.

ఒక్కరు కాదు.. పది మంది కాదు.. ఏకంగా 100 మంది పిల్లలకు తండ్రయ్యాడు.. అది కూడా పెళ్ళి కాకుండానే… అతనెవరో కాదు ప్రముఖ షార్ట్ మెసేజింగ్ ప్లాట్ ఫామ్ (Messaging platform) టెలిగ్రామ్ (Telegram) సీఈఓ (CEO) పావెల్ దురోవ్ (Pavel Durov) … స్వయంగా ఆయనే ఈ విషయాన్ని వెల్లడించి సంచలనం సృష్టించారు. తనకు 12 దేశాల్లో 100 మందికి పైగా సొంత పిల్లలున్నారని ప్రకటించారు. తన బయోలాజికల్ కిడ్స్ గురించి పలు వివరాలను అందరితో పంచుకున్నారు. వీర్యదానం ద్వారా 100 మందికి పైగా పిల్లలకు బయోలాజికల్ ఫాదర్ (Biological Father) అయ్యానని ఆ సుదీర్ఘ పోస్ట్ లో పేర్కొన్నారు. స్పెర్మ్ డొనేషన్ (Sperm Donation) ను విదేశాల్లో చాలా మంది అనుసరిస్తున్నారు. అయితే దీనికి దారితీసిన పరిస్థితులను కూడా ఆయన వెల్లడించారు. 15 ఏళ్ల క్రితం తన స్నేహితుడు సంతానోత్పత్తి (Fertility) సమస్యతో పిల్లలు పుట్టలేదని, తమకు బిడ్డ పుట్టడానికి క్లినిక్‌లో తన వీర్యాన్ని దానం చేయాలని కోరాడని చెప్పారు.

Sunita Williams : ISSలో చిక్కుకున్న సునీత విలియమ్స్‌.. ఇక భూమి మీదకు రారా ?

తను జోక్ చేస్తున్నాడేమో అనుకుని, గట్టిగా నవ్వేశానని… కానీ, అతడు సీరియస్ గానే ఆ రిక్వెస్ట్ చేశాడంటూ వెల్లడించారు. వీర్యదానం చేసేందుకు క్లినిక్‌కు వెళ్లినప్పుడు తనది అత్యంత నాణ్యత కలిగిన వీర్యం అని తేలిందని పావెల్‌ దురోవ్ వివరించారు. ఈ క్రమంలోనే తనకు పెద్ద సంఖ్యలో వీర్యదానం చేయాలన్న అభ్యర్థనలు వచ్చాయని, మొదట్లో ఇదంతా విచిత్రంగా అనిపించిదని గుర్తు చేసుకున్నారు. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి సమస్య ఉన్న జంటలకు సహాయపడుతుందని అర్థమైన ఆ సమస్యను సీరియస్‌గా తీసుకున్నానని చెప్పారు. అలా ఇప్పటివరకు 12 దేశాల్లో వందమందికి పైగా జంటలకు సంతానాన్ని అందించానని వెల్లడించారు. చాలా ఏళ్ల క్రితమే వీర్యదానాన్ని తాను ఆపినప్పటికీ.. ఇంకా ఫ్రీజ్‌ చేసిన తన కణాలతో ఎన్నో కుటుంబాలకు సంతానం కలిగిస్తున్నారని తెలుసుకున్నట్టు పావెల్ దురోవ్ చెప్పుకొచ్చారు.

Amarnath Yatra 2024 : అమర్‌నాథ్ యాత్రకు రికార్డు స్థాయిలో యాత్రికులు… 29 రోజుల్లో 4.51 లక్షల మంది దర్శనం

మరో ఆశ్చర్యకరమైన విషయాన్ని కూడా ఆయన పంచుకున్నారు. తన డీఎన్ఏను ఓపెన్ సోర్స్ చేయాలనే తన ఆలోచనను బయటపెట్టారు. తన పిల్లలు ఒకరినొకరు మరింత సులభంగా కనుగొనడానికి వీలుగా తన డిఎన్ఎను ఓపెన్ సోర్సింగ్ చేస్తానని పావెల్ దురోవ్ ప్రకటించారు. అలాగే భవిష్యత్‌లో తన బయోలాజికల్ పిల్లలకు ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే, ఉపయోగపడేందుకు వీలుగా తన డీఎన్‌ఏను ఓపెన్ సోర్స్ చేయనున్నట్లు దురోవ్ వెల్లడించారు. ఇక స్పెర్మ్ డొనేషన్ పై ఉన్న వ్యతిరేక భావనను తొలగించే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని బయటపెడుతున్నానని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం టెలిగ్రామ్ సిఈవో చేసిన ఈ ప్రకటన వైరల్ గా మారింది.