పవన్ బెంగళూరు టూర్, ఏనుగుల కోసం వెళ్ళారా…?

ఉత్తరాంధ్ర, చిత్తూరు జిల్లాల్లో ఏనుగుల సమస్య తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. వీటి పరిష్కారం కోసం ప్రభుత్వాలు ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నా సాధ్యం కావడం లేదు.

  • Written By:
  • Updated On - August 8, 2024 / 11:43 AM IST

ఉత్తరాంధ్ర, చిత్తూరు జిల్లాల్లో ఏనుగుల సమస్య తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. వీటి పరిష్కారం కోసం ప్రభుత్వాలు ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నా సాధ్యం కావడం లేదు. ఈ జిల్లాల్లో ఏనుగులు పంటలను నాశనం చేయడం, కొన్ని చోట్ల ప్రాణాలు తీయడం వంటివి చేస్తున్నాయి. ప్రధానంగా చెరకు, అరటి పంటలకు ఏనుగులు నష్టం చేకూరుస్తున్నాయి. ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం కోసం ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది.

ఇందుకోసం ఏపీ డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూర్ వెళ్ళారు. కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి. ఖంద్రే సమావేశం కానున్న పవన్… అక్కడ ఉన్న కుంకీ ఏనుగులను రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లా, పార్వతీపురం ప్రాంతంలో ఆందోళన కలిగిస్తున్న ఏనుగుల బారి నుంచి పరిష్కారం పై చర్చించనున్న పవన్… అలాంటి ఏనుగులను ఎదుర్కునేందుకు, తిరిగి అడవిలోకి తరిమేందుకు అవసరమైన కుంకీ ఏనుగులను రాష్ట్రానికి ఇవ్వాలని పవన్ కోరనున్నారు. కర్నాటక అడవుల్లో కుంకీ ఏనుగులు పెద్ద మొత్తంలో ఉన్నాయి.