Pawan Kalyan: టాప్‌ హీరోల అభిమానులపై కన్నేసిన పవన్‌.. వాళ్లు కలిసొస్తారా.. సేనాని స్ట్రాటజీ సక్సెస్ అవుతుందా?

పవన్ కల్యాణ్‌.. తన పని తాను చేసుకోవడం.. కష్టంలో ఉండే సాయం చేయడం.. ఈ రెండే తెలిసిన వ్యక్తి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత.. క్రమంగా రాటుదేలుతున్నారు అనిపిస్తోంది పవన్ ! ఏం మాట్లాడకుండా ఉండాలో కాదు.. ఏం మాటలు మాట్లాడాలో.. ఎవరిని మనసులు ఎలా గెలవాలో తెలియడమే అసలైన రాజకీయ నాయకుడి లక్షణం.

  • Written By:
  • Publish Date - June 22, 2023 / 05:30 PM IST

పవన్ ఇప్పుడు అలానే కనిపిస్తున్నారు. సినిమా హీరోగా అంతంత మాత్రం మాట్లాడే పవన్.. రాజకీయాలకు వచ్చేసరికి వైసీపీని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకుంటారు ప్రతీసారి. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు అన్నట్లు కనిపిస్తారు. అలాంటిది వారాహి యాత్రలో మాత్రం సమ్‌థింగ్ స్పెషల్ అనిపిస్తున్నారు. రాజకీయ పర్యటనల్లో సినిమా హీరోల పేర్లు పదేపదే ప్రస్తావిస్తున్నారు. బాలకృష్ణ, మహేష్‌బాబు, ప్రభాస్, ఎన్టీఆర్‌.. వీళ్లంతా తనకంటే పెద్ద హీరోలని చెప్తూ.. తన సింప్లిసిటీ ఏంటో చెప్పకనే చెప్తున్నారు పవన్. ఇదే ఇప్పుడు రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు కారణం అవుతోంది. అసలు వారాహి టూర్‌లో హీరోల పేర్లు ప్రస్తావించాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయ్.

ఐతే దీని వెనక పవన్ భారీ స్కెచ్ సిద్ధం చేసినట్లు అర్థం అవుతోంది. ఉభయగోదావరి జిల్లాల్లో సినిమా హీరోలకు ఫ్యాన్స్ ఎక్కువ. సినిమా అనేది వాళ్లకు ఓ ఎమోషన్. హీరోలను అయితే దేవుళ్లలా చూస్తుంటారు అక్కడ అందరూ ! ప్రతీ హీరోలకు లక్షల్లో అభిమానులు.. పదుల్లో అభిమాన సంఘాలు ఉంటాయ్. అభిమానం హద్దులు దాటుతుంటుంది అప్పుడప్పుడు. ఈ మధ్య అత్తిలిలో ప్రభాస్‌ ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగి.. ఓ అభిమాని చనిపోయాడు కూడా ! హీరోలకు అనుగుణంగా అభిమానుల మూడ్ ఉంటుంది ఉభయగోదావరి జిల్లాల్లో. కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు చూడాలి ఇంకా రచ్చ. పవన్ వర్సెస్ మిగతా హీరోలు అన్నట్లుగా సీన్ కనిపిస్తుంటుంది.

ఇది తెలుసు కాబట్టే.. పవన్ పదేపదే హీరోల పేర్లు ప్రస్తావిస్తున్నట్లు కనిపిస్తున్నారు. హీరోల పేరుతో ఓట్లు చీలిపోవద్దని ప్లాన్ చేస్తున్నారు. మేమంత ఒకటే.. ఆ హీరోలే నాకంటే ఎక్కువ అంటూ.. అందరు అభిమానుల ఈగోను శాటిస్‌ఫై చేస్తూ.. తనకు మద్దతుగా నిలిచేలా ప్లాన్ చేస్తున్నారు పవన్. పవన్ చెప్పిన హీరోలకు భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. లక్షల్లో అభిమానులు ఉన్నారు. వారంతా వన్ సైడ్‌గా ఉంటే.. పవన్‌కు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. వారు కూడా పార్టీలుగా విడిపోయి ఉన్నారు. అందుకే అందరినీ ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు పవన్‌. గోదావరి జిల్లాల్లో వైసీపీ ఖాతా కూడా తెరవకూడదనే కసి మీద ఉన్న పవన్.. ఒక్క ఓటు కూడా చీలకుండా ప్లాన్ చేస్తున్నారు.

వాళ్లంతా ప్రపంచానికి తెలుసు అని.. తాను అంతగా తెలియదని.. అయినా ఇగో లేదని, అందరూ హీరోలు ఇష్టమే అని చెప్పడం ద్వారా వారి ఫ్యాన్స్ ఓట్లు జనసేన వైపు రావడమే పవన్ టార్గెట్‌గా కనిపిస్తోంది. మరి పవన్ ప్రయత్నాలు ఫలిస్తాయా అంటే.. కచ్చితంగా నిజం అయి తీరేలా కనిపిస్తున్నాయ్. ఏపీలో వైసీపీ పాలన మీద యువతలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఆ పాయింట్‌ మీదే పవన్ టార్గెట్ చేస్తున్నారు. యువత విడిపోకుండా పక్కా ప్లాన్ చేస్తున్నారు. తనను తాను తగ్గించుకునేందుకు కూడా సిద్ధం అవుతున్నారు. ఇది కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మంచి ఫలితం చూపించడం ఖాయంగా కనిపిస్తోంది.