PAWAN KALYAN: కాకినాడ ఎంపీగా తంగెళ్ల ఉదయ్.. జనసేన నుంచి పోటీ..

తంగెళ్ల ఉదయ్ వ్యాపారవేత్త. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఫుడ్ చైన్ గ్రూప్.. టీ టైమ్ అధినేత. పవన్ వాడుతున్న వారాహి వాహనం కూడా ఉదయ్ పేరు మీదే ఉందని సమాచారం. ఆయన పిఠాపరం అసెంబ్లీ టిక్కెట్ ఆశించారు. కానీ, ఆ స్థానంలో పవన్ పోటీ చేస్తుండటంతో.. ఉదయ్‌కు కాకినాడ పార్లమెంట్ స్థానం కేటాయించారు.

  • Written By:
  • Publish Date - March 19, 2024 / 07:41 PM IST

PAWAN KALYAN: జనసేన నుంచి పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థిని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేయబోతున్నట్లు జనసేనాని వెల్లడించారు. పిఠాపురంలో మంగళవారం సాయంత్రం జరిగిన ఒక సమావేశంలో పవన్ తాజా ప్రకటన చేశారు. జనసేన ఏపీలో రెండు స్థానాల్లో పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. వాటిలో కాకినాడకు ఉదయ్‌ను ఎంపిక చేయగా, మరో స్థానానికి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.

YS JAGAN: మార్చి 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర.. షెడ్యూల్ ఖరారు..

తంగెళ్ల ఉదయ్ వ్యాపారవేత్త. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఫుడ్ చైన్ గ్రూప్.. టీ టైమ్ అధినేత. పవన్ వాడుతున్న వారాహి వాహనం కూడా ఉదయ్ పేరు మీదే ఉందని సమాచారం. ఆయన పిఠాపరం అసెంబ్లీ టిక్కెట్ ఆశించారు. కానీ, ఆ స్థానంలో పవన్ పోటీ చేస్తుండటంతో.. ఉదయ్‌కు కాకినాడ పార్లమెంట్ స్థానం కేటాయించారు. పిఠాపురంలో జరిగిన సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. తనకోసం ఉదయ్.. పిఠాపురం అసెంబ్లీ సీటును త్యాగం చేశాడని చెప్పారు. ఒకవేళ తాను ఎంపీగా పోటీ చేయాలని కేంద్ర మంత్రి అమిత్ షా ఆదేశిస్తే.. తాను కాకినాడ నుంచి పోటీ చేస్తానన్నారు. అప్పుడు ఉదయ్.. పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని, ఇద్దరం స్థానాలను మార్చుకుంటామని పవన్ అన్నారు. పిఠాపురం అసెంబ్లీ, కాకినాడ ఎంపీ స్థానాల తమకెంతో ముఖ్యమని పవన్ చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో జనసేన పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో జనసేన 21 అసెంబ్లీ స్థానాల నుంచి, 2 పార్లంమెంట్ స్థానాల నుంచి పోటీ చేయబోతుంది. “రాజకీయాలకు అతీతంగా పిఠాపురం అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. పిఠాపురం నుంచే ఆంధ్రప్రదేశ్ దశా, దిశ మార్చే ప్రయత్నం చేద్దాం.

భీమవరం, గాజువాక, పిఠాపురం నియోజకవర్గాలు నాకు 3 కళ్లు. పిఠాపురంను నా స్వస్థలం చేసుకుంటా. ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకుంటా. నా గెలుపు కోసం ఆలోచించకుండా, పార్టీ కోసం ప్రజల కోసం ఆలోచిస్తుంటే.. మిమ్మల్ని అసెంబ్లీకి పంపించే బాధ్యత మేం తీసుకుంటామని పిఠాపురం నేతలు, ప్రజలు చెప్పడం చాలా సంతోషాన్నిచ్చింది. వందల కోట్లిచ్చి నన్ను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారు. అందరి ఆశీస్సులుంటే జగన్ లక్ష రూపాయలిచ్చినా ఓడించలేడు. నాకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. 2009లో వంగా గీత.. పీఆర్పీ నుంచే గెలిచారు. ప్రస్తుతం ఆమె వైసీపీలో ఉన్నారు. ఆమె ఆ పార్టీని వీడి జనసేనలోకి రావాలని కోరుకుంటున్నా” అని పవన్ వ్యాఖ్యానించారు.