PAWAN KALYAN: తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చూడాలి: జనసేన అధినేత పవన్ కల్యాణ్

బలిదానాల తెలంగాణలో ఇంత అవినీతి ఉంటుందని నేను ఊహించలేదు. కమీషన్ల రాజ్యం నడుస్తోంది. ఆంధ్రా జన్మనిస్తే తెలంగాణ పునర్ జన్మ ఇచ్చింది. పదేళ్లలో నేను తెలంగాణపై మాట్లాడలేదు. దశాబ్దం తర్వాత మాట ఇస్తున్నా.. వచ్చే ఏడాది నుంచి ఆంధ్రాలోలాగే తెలంగాణలోనూ తిరుగుతాను.

  • Written By:
  • Updated On - November 22, 2023 / 08:06 PM IST

PAWAN KALYAN: తెలంగాణలో దళిత సీఎంను చూడలేకపోయామని, కనీసం బీసీ ముఖ్యమంత్రిని చూడాలని ఆశిస్తున్నట్లు చెప్పారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. బీసీ ముఖ్యమంత్రి కోసమే బీజేపీతో కలిసి నడుస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో బీజేపీతో కలిసి జనసేన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వరంగల్‌లో జరిగిన ప్రచార సభలో పవన్ పాల్గొన్నారు. బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. “ఆంధ్రాలో రౌడీలు రాజ్యామేలుతున్నారు. గూండాల పాలన నడుస్తోంది.

REVANTH REDDY: రైతులను ఆదుకుంటామని చెప్పి కేసీఆర్ మాట తప్పాడు: రేవంత్ రెడ్డి

అలాంటి పరిస్థితుల్లో తట్టుకుని నిలబడుతున్నానంటే వరంగల్ పోరాటస్ఫూర్తే కారణం. బలిదానాల తెలంగాణలో ఇంత అవినీతి ఉంటుందని నేను ఊహించలేదు. కమీషన్ల రాజ్యం నడుస్తోంది. ఆంధ్రా జన్మనిస్తే తెలంగాణ పునర్ జన్మ ఇచ్చింది. పదేళ్లలో నేను తెలంగాణపై మాట్లాడలేదు. దశాబ్దం తర్వాత మాట ఇస్తున్నా.. వచ్చే ఏడాది నుంచి ఆంధ్రాలోలాగే తెలంగాణలోనూ తిరుగుతాను. తెలంగాణలో దళిత ముఖ్యమంత్రిని చూడలేకపోయాం. బీసీ ముఖ్యమంత్రినైనా చూడాలి. అందుకే బీజేపీతో కలిశాను. బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వారిలో నేను ఒక్కడిని. తెలంగాణలో జనసేన ఉంటుంది. తెలంగాణలో బీజేపీతో కలిసి పనిచేస్తాం. ప్రధాని అంటే నాకు ఎంతో గౌరవం. తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే జనసేన స్థాపించాం.

జనసేన పార్టీ ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడటానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే కారణం. నాడు తెలంగాణకు మద్దతు ఇచ్చిన వారిలో నేను ఒకడిని. బీజేపీ అభ్యర్థులు రావుపద్మ, ప్రదీప్ రావును గెలిపించండి. సమస్యలొస్తే నేను అండగా ఉంటాను. తె జనసేన-బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి” అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.