PAWAN KALYAN: రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా వెళ్లకుండా జనసైనికులు పని చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. మంగళగిరిలో జనసేన కార్యకర్తలతో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. “ఒక్క సీటు కూడా వైసీపీకు వెళ్లకుండా పని చేయాలి. ఈ పోత్తు కనీసం ఓ దశాబ్దం కాలం పాటు ఉండాలి. దశాబ్ద కాలంపాటు పొత్తు ఉంటేనే రాష్ట్ర విభజన నష్టాన్ని, వైసీపీ పాలన విధ్వంసం నుంచి ఏపీని కాపాడుకోగలం.
REVANTH REDDY: మొన్న జీవన్ రెడ్డి.. నిన్న మల్లారెడ్డి.. ఎవరినీ వదలని రేవంత్.. బీఆర్ఎస్‌లో టెన్షన్
నా భవిష్యత్తు కోసం నేనేం చేయడం లేదు. ఏపీ భవిష్యత్తు కోసమే నేను కృషి చేస్తున్నాను. పార్టీ బలోపేతం కోసం పని చేయాలి. నేను దశాబ్దకాలంగా పని చేస్తున్నాను. పల్లం వైపే నీరు వెళ్తుంది. పార్టీ కోసం కష్టపడితే గుర్తింపు దానంతట అదే వస్తుంది. ప్రజలు తప్ప నాయకులంతా బాగు పడుతున్నారు. నేతలు కాంట్రాక్టులు చేసుకుంటున్నారు. దోపిడీ చేస్తున్నారు. సంపాదిస్తున్నారు. మైనార్టీలు నన్ను నమ్మాలి. రాజ్యాంగబద్దంగా ముస్లింలకు ఏం చేయాలో అవన్నీ చేస్తాను. వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడింది. దీనిని చక్క దిద్దాలి. నేను అన్ని మతాలను గౌరవిస్తా. మిమ్మల్ని ఓటు బ్యాంకుగా ఎప్పుడూ చూడను. ముస్లిం, మైనార్టీల అవసరాలకు అనుగుణంగా విధానాలు రూపొందిస్తాం.
వచ్చే ఎన్నికల్లో జనసేనకు అవకాశం ఇచ్చి చూడండి. బీజేపీ వల్ల ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ముస్లింలకు అన్యాయం జరిగితే పవన్ ముస్లింల వైపే ఉంటాడు. ముస్లింల పక్షాన గళం ఎత్తే నాయకుడ్ని నేనే. ఉద్దానం తర్వాత ప్రకాశం జిల్లాలోనే ఫ్లోరైడ్ సమస్య ఎక్కువగా ఉంది. ప్రకాశం జిల్లాలో వలసలు తగ్గించాలి. నీటి సమస్య, వలసలు తగ్గాలి, ఉపాధి అవకాశాలు పెంచాలి. రాష్ట్ర భవిష్యత్ కోసం కనీసం 10 ఏళ్లు పనిచేయాలి” అని పవన్ వ్యాఖ్యానించారు.