డియర్ ఏపీ సీఎం మీరు కామ్రేడ్స్ పుచ్చలపల్లి సుందరయ్య, కామ్రేడ్ తరిమేల నాగిరెడ్డి కాదు. అక్రమంగా సంపాదించిన మీకు క్లాస్ వార్ అనే పదాన్ని పలికే హక్కు లేదు. రాయలసీమ మీ నుంచి మీ గ్రూప్ నుంచి ఏదో ఒకరోజు విముక్తి పొందుతుందని ఆశిస్తున్నాను. అక్కడ పాపం పసివాడు సినిమా స్టోరీకి రాజస్థాన్ ఎడారిలో ఇసుక దిబ్బలు కావాలి. కానీ ఏపీలో మాత్రం వైఎస్సార్సీపీ నదుల నుంచి ఇసుకను దోచేస్తుంది. ఇక్కడ కలెక్షన్ పాయింట్లలో తగినంత ఇసుక దిబ్బలు ఉన్నాయి. చీర్స్’ అంటూ పవన్ ట్వీట్ చేశారు. మంగళవారం వైఎస్సార్ మత్స్యకార భరోసా 4వ విడత నిధులను జగన్ బాపట్ల జిల్లా నిజాంపట్నంలో విడుదల చేశారు. అర్హులైన ఒక్కొక్కరి ఖాతాలో 10 వేల చొప్పున జమ చేశారు.
ఆ తరువాత ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు, పవన్ మీద తీవ్ర విమర్శలు చేశారు ఏపీ సీఎం జగన్. చంద్రబాబు పొలిటికల్ స్క్రిప్ట్ ప్రకారం ప్యాకేజి స్టార్ నడుస్తాడని పవన్‌ను ఉద్దేశించి అన్నారు. పొత్తులు పెట్టుకునేది వీళ్లే. విడిపోయేది వీళ్లే. వివాహాలు చేసుకునేది వీళ్లే. విడిపోయేది వీళ్లే. రెండు సినిమాల గ్యాప్ మధ్య దత్తపుత్రుడు పొలిటికల్ మీటింగ్ పెడతారు. పార్టీని హోల్ సేల్‌గా ప్యాకేజిస్టార్ అమ్ముకున్నారని జగన్ ఆరోపించారు. కలిసి పోటీ చేద్దామని దత్తపుత్రునితో చంద్రబాబు అంటారు. చిత్తం ప్రభు అంటూ దత్తపుత్రుడు దాసోహం అంటారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్యాకేజి కోసం దత్తపుత్రుడు ఎలాంటి వేషాలైనా వేస్తాడు. వీరిది రాజకీయ పోరాటం కాదు. రాజకీయ ఆరాటం అంటూ విమర్శించారు. అధికారంలో ఉంటే అమరావతి.. అధికారం లేకపోతే హైదరాబాద్‌లో ఉంటారంటూ ఎద్దేవా చేశారు. జగన్ చేసిన ఈ కామెంట్స్‌కు పవన్ ఇప్పుడు కౌంటర్ ఇచ్చారు. పవన్ చేసిన ట్వీట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.