రాబోయే ఎన్నికల పుణ్యమేమో కానీ ముగ్గురు పెద్ద నిర్మాతల్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిండా ముంచేసాడు. పవన్ కళ్యాణ్ కొట్టిన దెబ్బకు ముగ్గురు నిర్మాతలు గిల్లా గిల్లా లాడిపోతున్నారు. సగం సగం పూర్తయిన సినిమాలతో ఇప్పుడేం చేయాలో తెలియక పిచ్చి చూపులు చూస్తున్నారు.
తెచ్చిన కోట్ల రూపాయల అప్పులు కి వడ్డీలు కడుతున్నారు. తప్పు ఎవరిదో తెలుసు ,ఎవరి వల్ల తాము ఇలా అయిపోయాము అన్నది కూడా తెలుసు కానీ పైకి ఎవరూ చెప్పరు. పవన్ కళ్యాణ్ ని ఏమైనా అంటే ఇండస్ట్రీలో అడ్రస్ ఉండదని, మరో సినిమా ఛాన్స్ రాదని ముగ్గురు నిర్మాతలు మనసులోనే కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారు. వీరిలో మొదటి నిర్మాత ఏ ఎం రత్నం. క్రిష్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు మూవీ స్టార్ట్ చేశారు. నిజానికి పదేళ్ల క్రితమే ఏ ఏం రత్నం పవన్ కళ్యాణ్ కి అడ్వాన్స్ ఇచ్చారు. అది తిరిగి తీసుకోమని పవన్ కళ్యాణ్ ఒకటికి రెండుసార్లు ఏం రత్నానికి చెప్పినా ఆయన తీసుకోలేదు. పీకే తో సినిమా చేయాల్సిందేనని పట్టుదలతో ఉన్నారు. ఆ సరదా ఇప్పుడు తీరిపోయింది. క్రిష్ డైరెక్షన్లో మూడేళ్ల క్రితం మొదలుపెట్టిన హరిహర వీరమల్లు సగం లోనే నిలిచిపోయింది. విప్లవకారుడిగా, మల్ల యోధుడిగా పవన్ కళ్యాణ్ ఏదో చేసేస్తాడు ఈ మూవీలో అనుకుంటే.. మొత్తానికి మూల పడింది హరిహర వీరమల్లు. అంతేకాదు ఈ దెబ్బతో డైరెక్టర్ క్రిష్ కెరీర్ కూడా అయోమయంలో పడిపోయింది.
ఇక ఓజి. దానయ్య నిర్మాతగా సుజిత్ డైరెక్షన్ లో టిపికల్ డాన్ మూవీ ఓ జి. సినిమా దాదాపు షూటింగ్ పూర్తయిపోయింది అన్నారు. గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ అయిపోద్ది రేపు మాపో రిలీజ్ అన్నారు. కానీ ఎటు కాకుండా ఆగిపోయింది ఓ జి. ఆర్ ఆర్ ఆర్ తో ఎక్కడికో ఎదిగిపోయిన ప్రొడ్యూసర్ దానయ్య పవన్ దెబ్బకి కుదేలైపోయాడు . డైరెక్టర్ సుజిత్ కూడా ఏం చేయాలో అర్థం కాక మరో సినిమా ఛాన్స్ రాక పిచ్చి చూపులు చూస్తున్నాడు. ఇక చివరిది ఉస్తాద్ భగత్ సింగ్. స్టార్ ప్రొడ్యూసర్ మైత్రి మూవీస్ అధినేత నవీన్ 10 సంవత్సరాల క్రితం
12 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ కు అడ్వాన్స్ ఇచ్చాడు. అప్పటినుంచి పవన్ కు రకరకాల సేవలు చేస్తూనే ఉన్నాడు. తమిళ్ సినిమా, విజయ్ హీరోగా వచ్చిన తేరి మూవీ హక్కులు కొన్నాడు. అది అప్పటికే పోలీసోడు అనే పేరుతో డబ్బింగ్ సినిమా గారి రిలీజ్ అయింది. అయినా పవన్ బొమ్మ చూపిస్తే చాలు సినిమా హిట్ అయిపోతుంది అనే ధైర్యంతో హరీష్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాద్ భగత్ సింగ్ పేరుతో పవన్తో మూవీ స్టార్ట్ చేశారు.
ఇది కూడా సగం షూటింగ్ పూర్తయి మిగిలింది ఆగిపోయింది. పాపం మైత్రి మూవీస్ నిర్మాతలు పరిస్థితి దారుణంగా ఉంది. ఫెయిల్యూర్ లేని నిర్మాతలుగా పేరున్న మైత్రి మూవీస్
పవన్ దెబ్బకి ఎటు కాకుండా అయిపోయారు. తనను తాను మూవీ మొగల్ గా ఫీలయ్యే డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్ కి నచ్చ చెప్పే ధైర్యం లేక అన్ని మూసుకొని కూర్చున్నాడు. ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ తో సినిమా తీయడానికి ఎందుకు నిర్మాతలు జంకుతారో ఇప్పుడు అర్థమైంది ఈ ముగ్గురు నిర్మాతలకి. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక, సినిమా పూర్తి కాక
అది ఎప్పుడు అవుతుందో తెలియక అయోమయంలో భయాందోళనలో ఉన్నారు ఈ నిర్మాతలు. ఏపీలో ఎన్నికల సీజన్ వచ్చేసింది.
టీడీపీ జనసేన మధ్య పొత్తులు కుదిరిపోయాయి. లాంఛనంగా ఎన్నికల ప్రచారంలోకి పవన్ కళ్యాణ్ అడుగు పెట్టేసారు కూడా. ఎన్నికలకు మూడు నెలలు మాత్రమే సమయం ఉన్న తరుణంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉన్న ఫలానా షూటింగులు పూర్తి చేస్తాడని అనుకోవడం అవివేకమే.. ఇక పీకే కొత్త సినిమాలు ఎన్నికల తర్వాతే ఉంటాయి. అప్పటివరకు వడ్డీలు కట్టుకుంటూ ఈ ముగ్గురు నిర్మాతలు ఎదురు చూడడం తప్ప మరో మార్గం లేదు. టీడీపీ జనసేన అధికారంలోకి వస్తే పవన్ అసలు షూటింగ్ కి రాడు. ఓడిపోతే మాత్రం తిరిగి వచ్చి మూడు సినిమాలు పూర్తి చేస్తాడేమో. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ దెబ్బకి ముగ్గురు నిర్మాతలు మాత్రం మట్టి అయిపోయారు.