Pawan Kalyan: టీడీపీతో జనసేన పొత్తు ఖరారు.. క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్

పవన్ కళ్యాణ్, చంద్రబాబు మధ్య ఉన్న రాజకీయ పొత్తు క్లారిటీపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి వెళతాం అని తెలిపారు పవన్ కళ్యాణ్.

  • Written By:
  • Publish Date - September 14, 2023 / 01:46 PM IST

చంద్రబాబు స్కిల్ డెవల్మెంట్ స్కామ్ తో ఏపీలో రాజకీయాలు వేడెక్కడమే కాదు మారిపోయాయి కూడా. నిన్న మన్నటి వరకూ తెలుగుదేశంతో అంటి అంటనట్టు ఉన్నారు పవన్ కళ్యాణ్.  తాజాగా కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా అగ్గిరాజుకుంది. గతంలో విడిపోయిన ఏపీకి అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు అవసరం అని భావించా కాబట్టే 2014లో మద్దతిచ్చా అన్నారు. గతంలో ఆయన పాలనకు నాకు విభేదాలు వచ్చిన మాట వాస్తవమే. అవి కేవలం పాలనా, విధానపరమైనవే అని చెప్పారు. ఇవాళ జరిగిన ములాఖత్ ఏపీ భవిష్యత్తుకు కీలకమైనది అని పేర్కొన్నారు. అందుకే తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తామని పేర్కొన్నారు.

టీడీపీ, జనసేన రాజకీయ భవిష్యత్తు కోసం కాదు..

ఆంధ్రప్రదేశ్ లో మీడియా సమావేశాలు వాడి వేడిని తలపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీని అందరూ కలిసి ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందని పవన్ కళ్యాణ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు రాజకీయవేత్త అని కొనియాడారు. జగన్ ఆర్థిక నేరస్థుడు అంటూ మండిపఢ్డారు. సైబరాబాద్ లాంటి మహానగరాన్ని నిర్మించిన వ్యక్తిని చరసాలలో బంధించడం బాధాకరం అని ఆవేదన వ్యక్తంపరిచారు. ఈరోజు మేము ఇద్దరం కలవడం తమ రాజకీయ ప్రయోజనాల కోసం కాదని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం అని స్పష్టత ఇచ్చారు. మన ఏపీ బాగుండాలనేదే నా ఆకాంక్ష అన్నారు.

బీజేపీని కలుపుకుని వెళ్లేందుకు సిద్దం..

రానున్న రోజుల్లో మరిన్ని పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్తామన్నారు. బీజేపీ మాతో కలిసి వస్తే తప్పకుండా ఆహ్వానిస్తాం. కలిసి వచ్చేందుకు సిద్దంగా ఉందని ఆశిస్తున్నాం ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో విసిపోయే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏపీ పరిపాలన, కక్ష సాధింపు చర్యలను అమిత్ షాతో పాటూ గవర్నర్ కి కూడా తెలియజేస్తామన్నారు. చంద్రబాబు భద్రత పై కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. వైసీపీ వ్యతిరేఖ ఓటును చీలనివ్వనని స్పష్టం చేశారు.

T.V.SRIKAR