Pawan kalyan : 11 రోజుల పాటు పవన్ కళ్యాణ్ దీక్ష

పవన్ కళ్యాణ్ కి దైవ భక్తి ఎక్కువ. ముఖ్యంగా ఆయన వారాహి అమ్మవారిని పూజిస్తారు. తాను స్థాపించిన జనసేన పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేయడానికి సిద్ధం చేసుకున్న వాహనానికి కూడా 'వారాహి' అనే పేరు పెట్టుకున్నారు.

 

 

పవన్ కళ్యాణ్ కి దైవ భక్తి ఎక్కువ. ముఖ్యంగా ఆయన వారాహి అమ్మవారిని పూజిస్తారు. తాను స్థాపించిన జనసేన పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేయడానికి సిద్ధం చేసుకున్న వాహనానికి కూడా ‘వారాహి’ అనే పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడమే కాకుండా.. ఏపీ ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఈ విజయానందంలో ఆయన వారాహి అమ్మవారి దీక్ష పాటించబోతున్నట్లు తెలుస్తోంది.

జూన్ 26 నుంచి 11 రోజుల పాటు ఈ దీక్ష పాటిస్తారు. ఈ 11 రోజులు పవన్ కళ్యాణ్ భోజనం చేయకుండా.. పాలు, పండ్లు మాత్రమే తీసుకుంటారు. కాగా గతేడాది జూన్ లోనూ ప్రజా సంక్షేమం కోసం పవన్ ఉపవాస దీక్ష చేపట్టడం విశేషం.ఈ జూన్ 26వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపడుతున్నట్లు జనసేన పార్టీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ప్రకటించింది.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 26వ తేదీ నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. 11 రోజులపాటు దీక్ష చేస్తారు. ఇందులో భాగంగా పాలు, పండ్లు, ద్రవాహారం తీసుకుంటారు. గత ఏడాది జూన్ మాసంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారాహి విజయ యాత్ర చేపట్టారు. ఆ యాత్ర సందర్భంలోనూ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు.” అని పేర్కొంది.