ఒజీ అంటే నిజానికి ఒజాస్ గంభీర అని అర్ధం. ఇందులో ఒజాస్ అనేది సంస్క్రుత పదం. దీనర్ధం చూస్తే చాలా శక్తి వంతమైందని తెలుస్తోంది. ఆత్మ పరంగం భౌతికంగా కూడా శక్తి అనే అర్ధాన్నిచ్చేది ఒజాస్, అలానే గంభీర్ అంటే గంభీరమైన.. ఇందులోమరో డౌట్ లేదు. ఐతే ఒజాస్ గంభీర అని పేరు పెట్టడానికి వేదాలకు లింకుంది.
పువ్వు పుట్టడానికి వాడిపోవడానికి మధ్య సమయంలో పువ్వు పరిమలించటానికి కావాల్సిన శక్తి ని ఒజాస్ అంటారనే వివరణ దొరుకుతోంది. సో ఒక పువ్వు పుట్టాలన్నా వాడిపోవాల్నా, ఆమధ్యలో జర్నీకి కారణమైన శక్తే అతను అనే అర్ధం వచ్చేలా ఓజీ టైటిల్ ని పెట్టారట. ఇక ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అనే మీనింగ్ వచ్చే ప్రచారం ఎలాగూ ఉంది. ఐతే ఓజీ అంటే ఈరెండు అర్ధాలు నిజమే అనేది కొత్తగా తెలుస్తోంది.
ఇక ఓజీలో పవన్ ఒకప్పటి గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తాడు..అంటే గ్యాంగ్ ని వదిలేసి సైలెంట్ అయ్యి, తర్వాత మళ్లీ ముంబై మాఫియా మీద విరుచుకుపడే ఒకప్పటి డాన్ గా వస్తాడు.. అచ్చంగా ఇది సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ భాషా స్టోరీలైన్ ని పోలినట్టే ఉంది.. కాకపోతే ట్రైలర్ వస్తే కాని అసలు కథేంటో అంచనా వేయలేం
ఇక పవన్ కళ్యాణ్ ఈమూవీలో ఒక మరాఠీ గ్యాంగ్ స్టర్, శ్రీకాకులంలో తన ఐడెంటిటీని మార్చుకుని బ్రతికితే.. తిరిగి ముంబైకి రావాల్సి వస్తే.. అన్నకోనంలో కథ ఉండబోతోందని తెలుస్తోంది. ఇక సాహో స్టైల్లో మేకింగ్, ఆ మూవీలో వాడిన వాజీ సిటీ పేరు ఇక్కడ వాడటం చూస్తే రెండు సినిమాల మధ్య లింక్ పెట్టి సుజీత్ ఇలా తన సినిమాటిక్ యూనివర్స్ చూపించబోతున్నాడని తెలుస్తోంది.