ఈ వీడియో నిడివి 2 నిమిషాలా 40 సెకన్లే అయినా దాని తాలూకు సారాంశం మాత్రం పవర్ స్టార్ పేరుకు తగ్గట్టుగా పవర్ ఫుల్ గానే ఉంది. తన సినీ ప్రస్తానం ప్రారంభించిన మొదలు తాజాగా తీసే చిత్రాల వరకూ అన్నింటినీ ఇందులో జతపరిచారు. ఈ ఒక్క వీడియో పవన్ అంటే ఏంటో డెఫినేషన్ ఇచ్చేలా రూపొందించారు. అంతేకాకుండా మొదటి పోస్ట్ పెట్టక ముందే ఏ సినిమా హీరోకి లేనంత మంది ఫాలోవర్స్ సంపాదించుకున్న మెగా హీరో తొలిపోస్ట్ తో ఇంకెందరి మనసులు చోరగొంటారో వేచిచూడాలి.
ఈవీడియోలో తన అన్నయ్య చిరంజీవితోపాటూ బాలీవుడ్ బాద్ షా బిగ్ బీ అమితాబ్ బచ్ఛన్ తో కలిసి దిగిన ఫోటోలు పొందుపరిచారు. నేటి తరం యువ హీరోలను కూడా ఇందులో చేర్చారు. నాటి ప్రముఖ దర్శకులు దాసరి మొదలు నేటి దిగ్గజ దర్శకులు రాజమౌళి వరకూ అందరినీ కలిశారు. నిర్మాతలు మొదలు తన స్నేహితులు ఆనంద్ వరకూ అందరితో కలిసి ఉన్న ఫోటోలు వచ్చేలా ఈ వీడియో తయారు చేశారు. దీని ద్వారా మరి కొంత మంది ఇతని అభిమానులుగా మారే అవకాశం ఉంది. ఇతని సర్కిల్ గురించి తెలియని వారికి సైతం తెలిపేలా తయారు చేశారు. తద్వారా రాజకీయాలకు మైలేజ్ పెంచుకునే ఆస్కారం కూడా లేకపోలేదు.
గతంలో పవన్ వారాహి రథంపై అనేక కామెంట్లు చేస్తూ వచ్చారు. తనకు హీరోలందరూ సన్నిహితులే. నాకు వాళ్ళకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. నేను అందరినీ అభిమానిస్తా అంటూ ప్రసంగంలో ప్రస్తావించారు. ప్రభాస్, ఎన్టీఆర్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పారు. తద్వారా ఆ హీరో అభిమానులను కూడా తన వైపుకు ఆకర్షించేందుకు ప్రయత్నం అంటున్నారు కొందరు విశ్లేషకులు. ఇందులో భాగంగానే బాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్ లోని హేమాహేమీలను తను కలిసినట్లు వీడియోలో చూపించుకోవడం ద్వారా గతంలో చేసిన వ్యాఖ్యలకు బలాన్ని చేకూర్చినట్లు అవుతుంది. ఈ కోణంలో ఆలోచించి ఈ వీడియోని పోస్ట్ చేసినట్లుగా కొందరు భావిస్తున్నారు.
ప్రతి పుస్తకం మాటతో ప్రారంభమైనట్లు వీడియో ప్రారంభంలో ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు చలన చిత్ర పరిశ్రమలో భాగమై ఎంతో మంది ప్రతిభావంతులతో, నిరాడంబరమైన వ్యక్తులతో కలిసి ప్రయాణింస్తున్నందుకు కృతజ్ఞుణ్ణి అని ముందు మాట రాశారు. అలాగే ఎండ్ కార్డ్ మన బంధం ఇలానే కొనసాగాలని, మరెన్నో మధురమైన జ్ఞాపకాల్ని పంచుకోవాలని ఆశిస్తూ పవన్ కళ్యాణ్ అని వినమ్రతతో కూడిన అభిమానాన్ని పంచుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
T.V.SRIKAR