Pawankalyan: మత పిచ్చిలో బీజేపీని మించిపోయిన పవన్‌.. ఇతనేనా ఇండియా చెగువేరా..?

ఆయనో మాలోకం.. మత పిచ్చి లేదంటాడు.. మతాల గురించే మాట్లాడతాడు. పవన్‌ కల్యాణ్‌ మరోసారి హిందూ ఆలయాల జోలికి పోయాడు.. జగన్‌ క్రిస్టియన్‌ అని ప్రజలకు గుర్తుచేసేలా మాట్లాడాడు..!

  • Written By:
  • Publish Date - June 17, 2023 / 01:07 PM IST

నాది రెల్లి కులం అంటాడు..జంధ్యం వేసుకుంటాడు..! మత పిచ్చి లేదంటాడు..యజ్ఞాలు, యాగాలు చేస్తాడు..! కులాల ప్రస్తావన లేని రాజకీయం అంటాడు..కొన్ని కూలాలను పనిగట్టుకొని తిట్టి పొడుస్తాడు..! మత రాజకీయాలు చేయనంటాడు.. గుళ్లు, గోపురాలు కుల్చింది వైసీపీనే అంటాడు..పిఠాపురం సభలో పవన్‌ కల్యాణ్‌ డబుల్‌ యాక్షన్‌ మరోసారి బయటపడింది. హిందూ ఆలయాలపై వైసీపీ కన్ను పడిందంటూ మరోసారి పాత పాటే మళ్లీ పాడారు.

వైసీపీకి నిజంగా అంత అవసరం ఏముంది..?
175లో 151 సీట్లు గెలుచుకున్నారు.. దర్జాగా మరో రెండు అసెంబ్లీ ఎన్నికల వరకు ఢోకా లేని గెలుపు అది..అయితే అందివచ్చిన అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకున్నారు..ఈ నాలుగేళ్ల వైసీపీ పాలనలో కొన్ని రంగాలు మాత్రమే అభివృద్ది వైపు పయనిస్తే చాలా రంగాలు పాతాళానికి పడిపోయాయి. ఇటు రెండు నెలల నుంచి కరెంట్‌ బిల్లుల బాదుడుతో ప్రజలు విలవిలలాడుతున్నారు. వైసీపీని విమర్శించడానికి.. కార్నర్‌ చేయడానికి చాలా కారణాలు దొరుకుతాయి.. అయినా పవన్‌కి మాత్రం ఎంత సేపు గుళ్లు,గోపురాలే.. అసలు మాట్లాడుతుంది పవనేనా లేకపోతే ఆయనలో దూరిన బీజేపీ ఎంపీ ప్రజ్ఙా సింగానన్న అనుమానం కలుగుతోంది. ఎందుకంటే నోరు విప్పితే విప్లవం.. చెగువేరా లాంటి మాటలు మాట్లాడుతూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్‌.. నాలుగేళ్లగా మత పిచ్చి పట్టినవాడిలా వ్యాఖ్యలు చేస్తున్నారు.

నిజానికి యజ్ఞాలు, యాగాలు చేయడం వాళ్ల వ్యక్తిగత విషయం. సీఎం కేసీఆర్‌ కూడా అలానే చేస్తుంటారు. ఎవరి నమ్మకాలు వారివి. ఒకరి నమ్మకాలు ఇతరుకు హాని తలపెట్టనంత వరకు వాటి జోలికి పోకూడదు..కానీ పవన్‌ని ప్రజలు ఊహించుకున్న తీరు వేరు.. కేసీఆర్‌ వేరు..! భగత్‌ సింగ్‌ స్ఫూర్తి అంటూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్‌.. కనీసం ఆయన సిద్ధాంతాలనైనా గుర్తుపెట్టుకున్నాడా అంటే లేదేమో అనిపిస్తోంది. బీజేపీతో పొత్తు పెట్టుకోగానే ఆ పార్టీ ఐడియాలజీ ఎలా ఫాలో అవుతారు..? ఇదంతా నాటకమా లేకపోతే పవన్‌ నిజంగానో అదో మాలోకమా..? ఏమో ఇదంతా తెలియదు కానీ.. ఓట్లు కోసం పవన్‌ మతాలను వాడుకోవడం మాత్రం ఆయన్ను మొదటి నుంచి అభిమానిస్తున్న నిజమైన ఫ్యాన్స్‌కి చాలా ఇబ్బందిగా మారింది.

ఇక పవన్‌ ఆరోపణల విషయానికి వద్దాం.. హిందూ ఆలయాలపై వైసీపీ కన్ను పడిందంటూ జనసేన అధినేల వ్యాఖ్యల్లో విద్వేషం, ఓట్లు కోసం జగన్‌ మతాన్ని ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నమే తప్ప లాజిక్‌ లేనే లేదు. 151సీట్లతో అధికారంలో ఉన్న పార్టీ మెజార్టీ ఓట్లు ఉన్న హిందూవుల ఓట్లను ఎలా కోల్పోతుంది..? గుళ్లు, గోపురాలు కుల్చాల్సిన అవసరం వైసీపీకి ఏముంది.? జగన్‌ క్రిస్టియన్ కాబట్టి ఇదంతా జరుగుతుందని ప్రజల్లోకి ఓ భావన వెళ్లేలా పవన్‌ చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు.. కానీ కేవలం కుల పిచ్చితోనే బతికే మెజార్టీ ప్రజలకు మతం పేరిట రాజకీయాలు చాలా చిన్నగా, చిల్లరగా కనిపిస్తాయి..ఆ విషయం పవన్‌ ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది.. ఇది ఏపీ.. నార్త్‌ బెల్ట్‌ కాదు.. కర్ణాటకలోనే మత రాజకీయాలు పనిచేయలేదు.. ఆంధ్రప్రదేశ్‌లో చేస్తాయని పవన్‌ ఎలా అనుకుంటున్నారు..?