PAWAN KALYAN: ఆస్తులు అమ్మేస్తున్న పవన్ కల్యాణ్‌.. పార్టీ నడపాలంటే మరో మార్గం లేదు..

రెండు ఎకరాల చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ, 50వేల రూపాయల అప్పు కోసం పడిగాపులు పడిన రాజశేఖర్ రెడ్డితో పాటు.. వందల వేల మంది రాజకీయ నాయకులు పాలిటిక్స్ ద్వారానే పదవులు పొంది.. దీన్నుంచి వ్యాపారాలు చేసి.. వేలు, లక్షల కోట్లు సంపాదిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - February 27, 2024 / 06:04 PM IST

PAWAN KALYAN: అప్పుడెప్పుడో టంగుటూరి ప్రకాశం పంతులు, కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య.. అలాంటివారు రాజకీయాల కోసం ఆస్తుల అమ్ముకున్నారని చదువుకున్నాం. పాత రాజకీయాలు మారిపోయాయ్‌. ఆస్తులు సంపాదించడానికి రాజకీయాల్లోకి వస్తున్నారు. వేలకోట్లు, లక్షల కోట్లు.. ఐదేళ్లలో సంపాదించాలంటే రాజకీయం తప్ప మరో మార్గం లేదని స్పష్టంగా ఉన్నారు లీడర్లు. రెండు ఎకరాల చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ, 50వేల రూపాయల అప్పు కోసం పడిగాపులు పడిన రాజశేఖర్ రెడ్డితో పాటు.. వందల వేల మంది రాజకీయ నాయకులు పాలిటిక్స్ ద్వారానే పదవులు పొంది.. దీన్నుంచి వ్యాపారాలు చేసి.. వేలు, లక్షల కోట్లు సంపాదిస్తున్నారు.

Pawan Kalyan: కొత్త జోష్.. కలవరపడొద్దు.. వీరమల్లు 2.0 ఉంది

సంపాదించారు కూడా! కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి ఉన్న ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఇటీవల కాలంలో రాజకీయం కోసం ఆస్తులమ్ముకున్న నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక్కడేనేమో బహుశా! ఆయన అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పుట్టినరోజుకు కూడా.. జేబులో నుంచి రూపాయి తీసి జనానికి ఖర్చు పెట్టలేదు. టికెట్లకు డబ్బులు దండుకున్నారని ఆయనపై కూడా అప్పట్లో ఆరోపణలు వచ్చాయ్‌. తాజాగా ఒక వారం కింద పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లోని తన స్థలం ఒకటి.. 20 కోట్ల రూపాయలకు అమ్ముకున్నారు. మరో రెండు స్థలాలను బేరానికి కూడా పెట్టారు. ఇవి కూడా అమ్మేస్తే పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్‌లో ఒక ఇల్లు, 12 ఎకరాల ఫామ్‌హౌస్ మాత్రమే మిగులుతాయ్. అత్తారింటికి దారేది తర్వాత పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఒక్కసారిగా పెరిగింది. ఆ తర్వాత ఆయన స్నేహితుల సలహాపై పిల్లల కోసం స్థలాలు కొని పెట్టుకున్నారు. వాటిని ఇప్పుడు అమ్మేస్తున్నారు. కోకాపేట్‌లో ఆయనకు ఎప్పటినుంచో ఫామ్ ఉంది. అది మాత్రమే పవన్‌కు స్థిరంగా ఉన్న ఆస్తి. ఆస్తులు అమ్ముకోవడం పవన్ కళ్యాణ్‌కు కొత్తేం కాదు.

Jr NTR: దేవర మూవీతో ఎన్టీఆర్‌కు అరుదైన రికార్డు ఖాయమా?

గతంలోనూ చాలా ఇష్టపడి జూబ్లీహిల్స్ నంది నగర్‌లో కట్టుకున్న ఇంటిని.. విడాకుల తర్వాత రేణు దేశాయ్‌కి ఇచ్చేశారు. ఆమె ఆ ఇంటిని తెలంగాణ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి అమ్మేశారు. మాటీవీలో షేర్లు తీసుకోవాలని గతంలో చిరంజీవి, అల్లు అరవింద్ ఒత్తిడి చేసినా ఆసక్తి చూపించలేదు పవన్ కళ్యాణ్. పెప్సీ కూల్ డ్రింక్‌కి ఒక్కసారి మాత్రమే అడ్వర్‌టైజ్‌మెంట్‌ చేసి.. ఆ తర్వాత తన కూల్‌డ్రింక్స్ ప్రకటనలో నటించనని ఖరాకండీగా చెప్పేశారు. సినిమాల మీద వచ్చే ఆదాయమే పవన్ కళ్యాణ్‌కి ఆధారం. పెద్దగా విలాసవంతమైన జీవితం గడపని పవన్ కుటుంబం నెల ఖర్చు 20లక్షల రూపాయలు లోపే. ఆయన సెక్యూరిటీకి మాత్రమే ఎక్కువ ఖర్చవుతుంది. అయితే ఇటీవల ప్రైవేట్ ఫ్లైట్‌లో తిరగడం.. ఆఫీస్ ఖర్చులు పెరగడంతో.. కొంత అప్పు చేయాల్సి వచ్చింది. అప్పులు తీర్చడానికి.. ఎన్నికల ఖర్చు కోసం ఉన్న స్థలాలన్నీ అమ్మేలా నిర్ణయించుకున్నారు పవన్. నిర్మాతల దగ్గర ఇప్పటికే అడ్వాన్స్ తీసుకుని ఉండడంతో.. మళ్లీ డబ్బు కోసం నిర్మాతలు ఇబ్బంది పెట్టడం బాగోదని.. ఆస్తులు అమ్మేయడమే మేలు అనే నిర్ణయానికి వచ్చారు.

జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులకు పార్టీ నుంచి అధికారికంగా ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా పవన్ నిర్ణయించారు. ఇప్పుడు ఈ ఖర్చులన్నింటికీ ఎవరినో బెదిరించడం కంటే.. ఉన్నదేదో అమ్మి పార్టీ నడపాలని పవన్ నిర్ణయించుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకునే హీరో.. చివరికి ఒక ఇల్లు, ఎప్పుడో కొనుక్కున్న ఫామ్ హౌస్‌తో మిగిలిపోవాల్సి వస్తోంది.