PAWAN KALYAN: పొత్తులపై తొందరపాటు మాటలొద్దు.. జనసైనికులకు పవన్ సూచన

పొత్తుల విషయంలో చర్చలు జరుగుతున్నందున, ఈ దశలో పార్టీ నాయకులు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. జనసేన పార్టీ విధానాలకు భిన్నమైన వ్యాఖ్యలు చేయొద్దన్నారు.

  • Written By:
  • Publish Date - February 10, 2024 / 04:04 PM IST

PAWAN KALYAN: ఏపీలో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. బీజేపీ కూడా వీరితో కలిసే అవకాశం ఉంది. అయితే, అది ఇంకా తేలలేదు. అయితే, సీట్లు, పొత్తుల విషయంలో జనసేనతోపాటు టీడీపీలోనూ కాస్త గందరగోళం కనిపిస్తోంది. కొన్నిచోట్ల ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే పరిస్థితి ఉంది. అందుకే ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. పొత్తుల విషయంలో చర్చలు జరుగుతున్నందున, ఈ దశలో పార్టీ నాయకులు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు.

KCR MEDIGADDA: అక్రమాల మేడిగడ్డ చూసొద్దాం.. కేసీఆర్‌కు రేవంత్ ఆహ్వానం

జనసేన పార్టీ విధానాలకు భిన్నమైన వ్యాఖ్యలు చేయొద్దన్నారు. ఇలాంటి ప్రకటనల వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించిన వారవుతారని పవన్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని, పొత్తులపై నిర్ణయంం తీసుకుని ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఏపీ సమగ్రాభివృద్ధికే తమ పార్టీ ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఎవరికైనా, ఎలాంటి అభిప్రాయాలు, సందేహాలు ఉంటే.. పార్టీ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ దృష్టికి తీసుకురావాలన్నారు. దీనివల్ల పార్టీ నేతలు, కార్యకర్తల ఆలోచనలు పార్టీకి చేరుతాయని పవన్ సూచించారు. అలాగే పార్టీ విధానాలకు, పొత్తులకు భిన్నంగా ప్రకటనలు చేస్తున్న వారి నుంచి అవసరమైతే వివరణలు తీసుకోవాలని కీలక నేతలకు సూచించినట్లు పవన్ తెలిపారు.

ప్రజలు స్థిరత్వాన్ని కోరుకుంటున్నారని, పొత్తుకు విఘాతం కలిగించే వారిని ప్రజలు గమనిస్తారని పవన్ అభిప్రాయపడ్డారు. ఇక.. టీడీపీ, జనసేన సీట్ల విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. బీజేపీ కూడా చేరితో కూటమి మరింత బలపడుతుందని నేతలు అభిప్రాయపడుతున్నారు.