PAWAN KALYAN: పవన్‌ అప్పులు.. పవన్‌కు చిరంజీవి భార్య ఎన్ని కోట్లు ఇచ్చిందో తెలుసా

మొత్తం తన కుటుంబం ఆస్తులు కలిపి 114 కోట్టే అని చెప్పడం ప్రతీ ఒక్కరినీ షాక్‌కు గురి చేసింది. ఇదే పెద్ద షాకింగ్‌ అంటే పవన్‌ కళ్యాణ్‌ అప్పులు వివరాలు మరో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఇప్పటి వరకూ పవన్‌ మొత్తం 46 కోట్ల అప్పులు చేసినట్టు అఫిడవిట్‌లో చెప్పారు.

  • Written By:
  • Publish Date - April 24, 2024 / 01:56 PM IST

PAWAN KALYAN: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హైయెస్ట్‌ రెమ్యునరేషన్‌ తీసుకునే స్టార్‌ ఎవరూ అంటే అంతా చెప్పే మాట పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌. ఒక్కరోజు షూటింగ్‌కు వెళ్తే రెండు కోట్లు తీసుకుంటాను అని గతంలో స్వయంగా పవన్‌ కళ్యాణ్‌ ఓ సందర్భంలో చెప్పారు. ఇదంతా చూస్తే పవన్‌ కళ్యాణ్‌ కొన్ని వందల కోట్లుకు అధిపతి అని అంతా అనుకుంటారు. కానీ ఎన్నికల సందర్భంగా పవన్‌ వివరించిన తన ఆస్తుల వివరాలు ప్రతీ ఒక్కరినీ షాక్‌కు గురి చేశాయి.

Rajinikanth: సూపర్ స్టారా మజాకా..? ఆసియాలోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్..?

మొత్తం తన కుటుంబం ఆస్తులు కలిపి 114 కోట్టే అని చెప్పడం ప్రతీ ఒక్కరినీ షాక్‌కు గురి చేసింది. ఇదే పెద్ద షాకింగ్‌ అంటే పవన్‌ కళ్యాణ్‌ అప్పులు వివరాలు మరో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఇప్పటి వరకూ పవన్‌ మొత్తం 46 కోట్ల అప్పులు చేసినట్టు అఫిడవిట్‌లో చెప్పారు. వివిధ వ్యక్తులు సంస్థలు కలిపి మొత్తం 15 మార్గాలా ద్వారా అప్పులు చేశారు. ఇందులో తాను ఎవరి దగ్గర ఎంత అప్పు చేశారో క్లియర్‌గా వివరించారు పవన్‌ కళ్యాణ్‌. విజయలక్ష్మి వీఆర్‌కు తాను 8 కోట్లు ఇవ్వాలని చెప్పారు పవన్‌. హారిక అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ నుంచి 6 కోట్ల 35 లక్షలు అప్పు తీసుకున్నట్టు చెప్పారు. లీడ్‌ ఐటీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి 6 కోట్లు, ఎంవీఆర్‌ఎస్‌ ప్రసాద్‌ నుంచి 3 కోట్ల 50 లక్షలు అప్పు తీసుకున్నట్టు చెప్పారు. ఇక ఎర్నేని నవీన్‌కు 5 కోట్ల 50 లక్షలు, ఎం ప్రవీణ్‌ కుమార్‌కు 3 కోట్లు తాను అప్పున్నట్టు చెప్పారు. ఇవే కాకుండా మైత్రి మూవీ మేకర్స్‌ నుంచి 3 కోట్లు, యశ్వంత్‌ ఫైనాన్షియర్స్‌ నుంచి 3 కోట్లు, రాహుల్‌ కుందవరపు నుంచి 2 కోట్ల 80 లక్షలు అప్పుగా తీసుకున్నట్టు అఫిడవిట్‌లో చెప్పారు.

ఎంవీఆర్ఎస్‌ ప్రసాద్‌ కూడా తనకు 2 కోట్లు అప్పు ఇచ్చారని.. తన వదిన కొణిదెల సురేఖ నుంచి కూడా 2 కోట్లు అప్పు తీసుకున్నట్టు చెప్పారు పవన్‌ కళ్యాణ్‌. ఇవే కాకుండా కోటింరెడ్డి సాహిత్య రెడ్డి నుంచి 50 లక్షలు, లింగారెడ్డి లలిత నుంచి 50 లక్షలు, ఏ దయాకర్‌ నుంచి 45 లక్షలు, డీవీవీ ఎంటర్టైన్‌మెంట్‌ నుంచి 10 లక్షలు అప్పుగా తీసుకున్నట్టు చెప్పారు. ఇలా మొత్తం వివిధ వ్యక్తుల నుంచి సంస్థల నుంచి కలిపి 46 కోట్ల 70 లక్షలు అప్పులు చేసినట్టు చెప్పారు. ఎవరికైనా అప్పులు ఉండటం సహజం. కానీ టాప్‌ మోస్ట్‌ హీరో ఐన పవన్‌కు అప్పులు ఉండటం అది కూడా తన అస్తిలో సగం కంటే ఎక్కువ శాతం అప్పులే ఉండటం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.