PAWAN KALYAN: యువగళం పాదయాత్ర ముగింపు సభకు పవన్

నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద ఈ నెల 20న యువగళం విజయోత్సవ సభ జరగబోతుంది.

  • Written By:
  • Publish Date - December 18, 2023 / 02:32 PM IST

PAWAN KALYAN: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద ఈ నెల 20న యువగళం విజయోత్సవ సభ జరగబోతుంది. దీనికోసం టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరుకానున్నారు.

Etala Rajender : అయోమయంలో ఈటల రాజేందర్ .. ఎటు పోవాలి.. ? ఏం చేయాలి.. ?

ఈ సభకు హాజరు కావాలని పవన్‌కు టీడీపీ ఆహ్వానం పంపింది. కానీ, ఆ రోజున వేరే కార్యక్రమాలు ఉన్నాయని, తాను హాజరు కాలేనని మొదట టీడీపీ నేతలకు పవన్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం పవన్ ఇంటికి చంద్రబాబు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ చంద్రబాబు స్వయంగా పవన్‌ను యువగళం ముగింపు సభకు రావాలని ఆహ్వానం అందించారు. చంద్రబాబు ప్రత్యేక ఆహ్వానం మేరకు తాను సభకు హాజరవుతానని పవన్ కల్యాణ్ చెప్పారు. దీంతో ‘యువగళం’ సభకు పవన్ హాజరవుతున్నట్లు టీడీపీ అధికారికంగా ప్రకటించింది. గత జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభించారు. దాదాపు 11 నెలల పాటు సాగిన యువగళం పాదయాత్ర సోమవారం విశాఖ జిల్లా అగనంపూడి వద్ద ముగియనుంది.

మొత్తంగా ఈ రోజుతో లోకేశ్ 3,132 కి.మీ పాదయాత్ర చేసినట్లవుతుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు చేపట్టిన ‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్ర కూడా అగనంపూడి వద్దే ముగిసింది. అందుకే.. అదే సెంటిమెంటుతో ఇప్పుడు లోకేశ్ కూడా అగనంపూడిలోనే పాదయాత్ర ముగిస్తున్నారు. పాదయాత్ర ముగింపు సభను భారీగా నిర్వహించేందుకు టీడీపీ కసరత్తు చేస్తోంది. ఏపీలో జరగబోయే ఎన్నికల శంఖారావానికి ‘యువగళం’ ముగింపు సభ ఇరు పార్టీలకు వేదిక కానుంది. టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు తర్వాత భారీ ఎత్తున నిర్వహిస్తున్న కార్యక్రమం ఇదే.