PAWAN KALYAN: టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరింది. సీట్ల లెక్కలు కూడా తేలిపోయాయ్. బీజేపీ ఎంట్రీతో.. జనసేనకు ఒక సీటు కోత పడింది. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది. పొత్తులో భాగంగా జనసేనకు 24అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాలు కేటాయించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇప్పటికే 5అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా ప్రకటించారు పవన్. ఐతే కూటమిలో చేరిన బీజేపీ 8ఎంపీ స్థానాలు కోరగా.. బీజేపీ, జనసేనకు కలిపి 8ఎంపీ సీట్లు, 30 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు ఓకే చెప్పారు.
AP POLITICS: ఏపీలో ఆ ఆరు స్థానాలే కీలకం.. రాజకీయం అంతా అక్కడే..
ఇందులో బీజేపీకి ఆరు ఎంపీ సీట్లు దక్కబోతున్నాయ్. ఇప్పటికే జనసేనకు కేటాయించిన 3ఎంపీ సీట్లలో.. ఒక సీటును బీజేపీకి ఇవ్వాల్సి వస్తోంది. ఐతే 3 పార్లమెంట్ స్థానాల్లో జనసేన అభ్యర్థులు ఇప్పటికే తమ కార్యక్రమాలు మొదలుపెట్టారు. కాకినాడ, మచిలీపట్నం, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల్లో జనసేన పోటీచేసేందుకు సిద్ధపడింది. అనకాపల్లి నుంచి నాగబాబు, మచిలీపట్నం నుంచి సిట్టింగ్ ఎంపీ బాలశౌరి, కాకినాడ నుంచి సానా సతీష్‌కుమార్ ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు ఇప్పటివరకు! బీజేపీతో పొత్తు తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. కాకినాడ నుంచి పవన్ ఎంపీగా పోటీ చేస్తారని కన్ఫార్మ్ అయింది. అక్కడ ఎలాంటి సమస్య లేకపోయినా.. మిగిలిన ఒక్క స్థానం గురించే చర్చ. వైసీపీ నుంచి జనసేనలో చేరిన సిట్టింగ్ ఎంపీ బాలశౌరి మచిలీపట్నం నుంచి.. మళ్లీ టికెట్ ఆశిస్తున్నారు. ఆయనకు లేదు అనే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఎటు తిరిగి దెబ్బ పడేది నాగబాబుకే ! పోటీ చేసే అవకాశం కూడా లేకపోవచ్చు.
ఎంపీ కావాలన్నది ఆయన కల ఒకరకంగా. ఈసారి కూడా అది నెరవేరే పరిస్థితి ఉండకపోవచ్చు. ఉన్న రెండు స్థానాల్లో ఒకటి పవన్, ఇంకొకటి బాలశౌరి పోటీ చేస్తారు. సో.. నాగబాబుకు మళ్లీ మొండిచేయే. ఇదంతా ఎలా ఉన్నా.. టీడీపీతో పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ టికెట్లు తీసుకున్నప్పుడు.. పవన్ తీరుపై జనసైనికులు, కాపు సామాజికవర్గం నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సెగలు ఇంకా తగులుతుండగానే.. ఇప్పుడు మూడు ఎంపీల్లో ఓ స్థానం కోల్పోవాల్సి వస్తే పరిస్థితి ఏంటి.. వాళ్ల నుంచి ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుందనే చర్చ జరుగుతోంది.