PAWAN KALYAN: పవన్‌ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం.. ప్రచారం ఆగిపోయినట్లేనా..?

పిఠాపురంలో పవన్‌ 20 కిలోమీటర్లు ఎండలో పాదయాత్ర చేశారు. వేడికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో జ్వరం బారినపడ్డారు. ఐతే జ్వరంలోనూ ప్రచారం కొనసాగించాలని పవన్ భావించినా.. అసలు ఓపిక లేని పరిస్థితి ఉంది.

  • Written By:
  • Publish Date - April 3, 2024 / 03:32 PM IST

PAWAN KALYAN: తెనాలిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన రద్దయింది. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. తెనాలిలో ర్యాలీ, సభల్లో‌ ఆయన పాల్గొనాల్సి ఉంది. ఐతే అది కాస్త అనారోగ్య సమస్యలతో వాయిదా పడింది. పిఠాపురంలో పవన్‌ 20 కిలోమీటర్లు ఎండలో పాదయాత్ర చేశారు. వేడికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో జ్వరం బారినపడ్డారు. ఐతే జ్వరంలోనూ ప్రచారం కొనసాగించాలని పవన్ భావించినా.. అసలు ఓపిక లేని పరిస్థితి ఉంది.

KTR ON PHONE TAPPING: హీరోయిన్లను బెదిరించలేదు.. ఢిల్లీకి డబ్బులు పంపడంపైనే రేవంత్ దృష్టి: కేటీఆర్

పూర్తిగా జ్వరం తగ్గక పోవడంతో తెనాలి‌ పర్యటనను పవన్ రద్దు చేసుకున్నారు. మళ్లీ తేదీ, సమయం ప్రకటిస్తామని జనసేన నేతలు తెలిపారు. ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయ్. ఐనా సరే ఎండలను లెక్క చేయకుండా.. పవన్ వారాహి విజయ భేరి యాత్ర నిర్వహిస్తున్నారు. మండుటెండలో ఏకంగా 20 కిలోమీటర్ల పాటు పాదయాత్ర నిర్వహించారు. దీంతో జ్వరం చుట్టుకుంది. ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పడంతో.. తెనాలి పర్యటనను పవన్ రద్దు చేసుకున్నారు. జ్వరం తగ్గిన వెంటనే తిరిగి పర్యటన కొనసాగించనున్నారు. నాలుగు రోజుల క్రితమే అంటే పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలోనే పవన్ అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది.

అయినా లెక్కచేయక పర్యటనను కొనసాగించారు. ప్రస్తుతం ఆయన చికిత్స కోసం హైదరాబాద్ పయనమయ్యారు. ఆయన ప్రచారానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. తెనాలితో పాటు, నెల్లిమర్లలో జరగాల్సిన పర్యటన కూడా వాయిదా పడింది. పవన్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు పూజలు చేస్తున్నారు.