Red Sandal : పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్.. వైసీపీ లీడర్లకు తడిచిపోతోంది…

ఏపీలో ఎన్నో యేళ్ళుగా ఎర్రచందనం అక్రమంగా రవాణా అవుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక అది మరింత పెరిగిపోయింది. అటవీ శాఖలో పెద్ద తలకాయల అండతో వైసీపీ లీడర్లు కూడా యధేచ్చగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేసినట్టు టీడీపీ నాయకులు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు.

ఏపీలో ఎన్నో యేళ్ళుగా ఎర్రచందనం అక్రమంగా రవాణా అవుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక అది మరింత పెరిగిపోయింది. అటవీ శాఖలో పెద్ద తలకాయల అండతో వైసీపీ లీడర్లు కూడా యధేచ్చగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేసినట్టు టీడీపీ నాయకులు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దగ్గరే అటవీ శాఖ కూడా ఉంది. దాంతో స్మగ్లింగ్ పై పవన్ సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో… అటవీ శాఖాధికారులతో పాటు పోలీసులు అప్రమత్తమయ్యారు. తమ గుట్టు ఎక్కడ బయట పడుతుందోని వైసీపీ లీడర్లు వణికిపోతున్నారు. రెడ్ శాండిల్ దుంగలు విదేశాలకు తరలించి… వేల కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళంతా టెన్షన్ పడుతున్నారు.

వైసీపీ హయాంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కు సహకరించని … అటవీశాఖ అధికారులు, సిబ్బంది… పోలీసులను తిరుపతి ఏరియా నుంచి బదిలీ చేయించారు ఆ పార్టీ లీడర్లు. రాజమండ్రి, శ్రీకాకుళం, వైజాగ్ కు పంపించేశారు. తమ దందాకు సహకరించే వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నారు. బదిలీ అయి వెళ్ళిపోయిన అధికారులు, సిబ్బంది ఇప్పుడు మా గుట్టు ఎక్కడ బయటపెడతారో అని ఎర్రచందనం తరలించిన కొందరు వైసీపీ లీడర్లు హడలిపోతున్నారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవులు, సదాశివకోన, తలకోన, నాగలాపురం, పిచ్చాటూరు ఏరియాల్లోని అడవుల్లో ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. ఇక్కడి రెడ్ శాండిల్ కి విదేశాల్లో బాగా గిరాకీ ఉంటుంది. అందుకే పుష్ప సినిమా తరహాలో ఎర్రచందనం దుంగలను తరలించారు కొందరు లీడర్లు. చెన్నైలోని స్మగ్లర్లతో డీల్ మాట్లాడుకొని… చిత్తూరు అడవుల నుంచి అక్రమ మార్గాల్లో చెన్నైకి పంపేవారు. అక్కడి నుంచి దుంగలు విదేశాలకు వెళ్ళిపోయేవి. తమిళనాడు నుంచి కూలీలను తీసుకొచ్చి…వాళ్ళకి వేలల్లో డబ్బులిచ్చి శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లు కొట్టించారు. వైసీపీ లీడర్ల అండతో అవి చెన్నైకి తరలిపోయేవి. చెక్ పోస్టుల్లో సహకరించని సిబ్బందిని కూడా అప్పటి ప్రభుత్వంలోని కొందరు పెద్దలు వేరే జిల్లాలకు ట్రాన్స్ ఫర్ చేయించినట్టు ఆరోపణలున్నాయి.

అధికార పార్టీ పెద్దలే స్మగ్లింగ్ లో ఇన్వాల్వ్ అవడంతో… అటవీ శాఖలోని పెద్దలు కూడా పూర్తి సహకారం అందించేవారు. ఎప్పుడన్నా… చిన్నా చితకా కేసులు పెట్టి చేతులు దులుపుకునేవారు. ఎర్రచందనం తరలిస్తున్న స్మగ్లర్ల మీద కాకుండా తమిళనాడు కూలీలపై కేసులు పెట్టి కొన్ని దుంగలను రికవరీ చేసినట్లు చూపించేవారు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాత్రం… ఎర్రచందనం తరలించే కూలీలే కాదు… కింగ్ పిన్స్ ని పట్టుకోవాలని సీరియస్ గా ఆదేశాలిచ్చారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వాళ్లు ఎవరైనా సరే… వదిలిపెట్టొద్దనీ… పాత కేసులు కూడా తిరగదోడాలని ఆదేశించారు. స్మగ్లర్లకు సహకరించే అధికారులను కూడా వదిలిపెట్టబోనని వార్నింగిచ్చారు పవన్. దాంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న అటవీ శాఖ అధికారులు, చెక్ పోస్టుల సిబ్బందికి దడ మొదలైంది. అధికారులు, సిబ్బంది సస్పెండ్ తో పాటు వైసీపీ లీడర్లపై కేసులు బుక్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.