Pawan Kalyan: ఓ వైపు చంద్రబాబు అరెస్ట్‌.. మరోవైపు పొత్తులు ఐనా పవన్ పెద్దగా నోరు మెదపలేదేంటి ?

ఓ వైపు అరెస్ట్‌.. మరోవైపు పొత్తు.. పవన్ నోరు మెదపరేంటి.. ఏమైంది సేనానికి అంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. పవన్‌ నాలుగో విడత వారాహి యాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. యాత్ర మొదటి రోజున పవన్ ప్రసంగంపై జనసేన నాయకులతో పాటు, టీడీపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్.

  • Written By:
  • Publish Date - October 2, 2023 / 12:49 PM IST

చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. అదీ పొత్తుల గురించి ప్రకటన చేసిన తర్వాత.. వారాహి యాత్ర చేపడుతున్నారంటే.. పవన్ మాటల మీద, ప్రకటనల మీద.. జనసైనికులతో పాటు తెలుగు తమ్ముళ్లు కూడా చాలానే హోప్స్‌ పెట్టుకున్నారు. తీరా ఏంటయ్యా అంటే.. వచ్చామా ఇద్దరు కవుల పేర్లు, నాలుగు పుస్తకాల పేర్లు.. ఆరు చిన్ననాటి అనుభవాలు చెప్పామా.. వెళ్లిపోయామా అన్నట్లుగా పవన్‌ తీరు కనిపించింది. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది. ఓ వైపు అరెస్ట్‌.. మరోవైపు పొత్తు.. పవన్ నోరు మెదపరేంటి.. ఏమైంది సేనానికి అంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. పవన్‌ నాలుగో విడత వారాహి యాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. యాత్ర మొదటి రోజున పవన్ ప్రసంగంపై జనసేన నాయకులతో పాటు, టీడీపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్.

నిజానికి మొదటి మూడు విడతల్లో వైసీపీని ఓ ఆట ఆడుకున్నారు పవన్‌. పంచ్‌లు, సెటైర్లు, విమర్శలు, ఆరోపణలు.. మాములుగా పేలలేదు పవన్ మాటలు అప్పుడు. నాలుగో విడతలో మాట్లాడేందుకు చాలా స్కోప్ ఉన్నా.. ఎందుకో పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు పవన్‌. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై సేనాని తీవ్రస్థాయిలో ఫైర్ అవుతారని.. మూడు విడతల వారాహి యాత్రలో మాదిరిగానే ఆవేశంతో వైసీపీ సర్కార్‌పై విమర్శలు చేస్తారని… టీడీపీ, జనసేన పొత్తు వ్యవహారంపై మరింత క్లార్టీ ఇస్తారని.. ఇలా చాలా అంచనాలు పెట్టుకున్నారు అంతా ! ఐతే ఆశించిన స్థాయిలో పవన్ ప్రసంగం లేదనే నిట్టూర్పులు.. రెండు పార్టీల నేతల నుంచి వినిపిస్తున్నాయ్. కౌరవులు, పాండవులు అనే డైలాగులు చెప్తూ.. ప్రముఖ కవుల కొటేషన్లు ప్రస్తావిస్తూ.. పవన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

తన ప్రసంగంలో ఎక్కడా చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించలేదు. చంద్రబాబు తప్పు చేయలేదని కూడా చెప్పలేదు. దీంతో టీడీపీ శ్రేణులు నిరాశ వ్యక్తం చేస్తున్నాయ్. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది. పవన్ వెనక్కి తగ్గారని కొందరు.. వాలంటీర్ల విషయంలో పవన్‌కు భయం పట్టుకుందని అందుకే సైలెంట్‌గా ఉన్నారని ఇంకొందరు అంటున్నారు. ఐతే పవన్ దూకుడుకు బీజేపీ హైకమాండ్ బ్రేకులు వేసిందని… టీడీపీ, చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో దూకుడు తగ్గించాలని సూచించి ఉండొచ్చని మరికొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయ్. పవన్ వారాహియాత్రకు జనసేన నాయకులతో పాటు, టీడీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యాయ్. మూడు విడతల్లో చేపట్టిన వారాహి యాత్రకు మంచి ఊపు వచ్చేలా.. పవన్‌ ఆవేశంగా ప్రసంగాలు చేశారు. ఐతే నాలుగో విడత యాత్రలో మాత్రం.. సాదాసీదాగా ప్రసంగాలు ఉండడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయ్.