Paytm FASTag: పేటీఎంకు మరో బిగ్ షాక్.. ఫాస్టాగ్ జారీ నుంచి పేటీఎం అవుట్

ఈ మేరకు ఫాస్టాగ్ జారీ చేసే బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంకును తొలగించింది. ఫాస్టాగ్ వాడే వినియోగదారులు మిగతా 32 బ్యాంకుల నుంచి వాటిని కొనుగోలు చేయాలని ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్ఎంసీఎల్) సూచించింది.

  • Written By:
  • Publish Date - February 16, 2024 / 03:25 PM IST

Paytm FASTag: ఆర్బీఐ ఆంక్షలు, షేర్ల పతనంతో సతమతమవుతున్న పేటీఎంకు మరో పెద్ద షాక్ తగిలింది. ఫాస్టాగ్ జారీని నిలిపివేయాలని పేటీఎంను ఆదేశించింది. ఈ మేరకు ఫాస్టాగ్ జారీ చేసే బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంకును తొలగించింది. ఫాస్టాగ్ వాడే వినియోగదారులు మిగతా 32 బ్యాంకుల నుంచి వాటిని కొనుగోలు చేయాలని ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్ఎంసీఎల్) సూచించింది.

BJP-BRS: బీజేపీ–బీఆర్ఎస్ పక్కా స్కెచ్.. ఎన్నికల తర్వాత ఏం జరగబోతోంది..?

ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా వివరాలు వెల్లడించింది ఫాస్టాగ్. ఇబ్బంది లేని ప్రయాణం కోసం 32 అధీకృత బ్యాంకుల నుంచి ఫాస్టాగ్ కొనుగోలు చేయవచ్చని సూచించింది. దీంతో ఇకపై పేటీఎం యాప్‌లో, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి ఫాస్టాగ్ కొనుగోలు చేసేందుకు అవకాశం ఉండదు. హైవేలపై ప్రయాణిస్తూ, ఫాస్టాగ్ ద్వారా టోల్ ఫీజు చెల్లించే వాహనదారులు ఈ విషయాన్ని గుర్తించాలని ఐహెచ్ఎంసీఎల్ సూచించింది. అలాగే.. ఫాస్టాగ్ యూజర్లంతా ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఆదేశించింది ఐహెచ్ఎంసీఎల్. ఈ నిర్ణయం పేటీఎంకు మరో భారీ ఎదురుదెబ్బగానే చెప్పాలి. ఈ నెల 29 తర్వాత నుంచి పేటీఎం వ్యాలెట్లు, ఖాతాలు, ఫాస్టాగ్ రీచార్జ్‌లు, టాప్ అప్‌లు స్వీకరించవద్దని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌ను ఆర్బీఐ గతంలోనే ఆదేశించింది. అయితే, ఇప్పటికే రీచార్జ్ చేసి ఉంటే, ఆ నగదును గడువులోపు వినియోగించుకోవచ్చని సూచించింది.

గత జనవరి 31న ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో పేటీఎం షేర్లు భారీగా పతనమయ్యాయి. కేవైసీ పూర్తి చేయకుండానే బ్యాంకు ఖాతాల నిర్వహణ, మనీ లాండరింగ్ వంటి ఆరోపణల నేపథ్యంలో ఆర్బీఐ పేటీఎంపై ఆంక్షలు విధించింది. ఇప్పుడీ నిర్ణయం ఇతర పేమెంట్స్ బ్యాంకులపైనా పడుతోంది. ఇప్పటికే ఇతర పేమెంట్స్ బ్యాంకులపైనా RBI నిఘా పెట్టింది. పేటీఎం లాగా మరో 4 సంస్థల KYC నిర్వహణలో కూడా లోపాలున్నట్లు ప్రాథమికంగా గుర్తించింది. సరైన KYC డాక్యుమెంట్లు లేని 50 వేల బ్యాంక్ ఖాతాలున్నట్లు తేలింది. వీటిల్లో 30 వేల అకౌంట్స్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌తో లింక్ అయి ఉన్నాయి. దీంతో ఆయా బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ చర్యలకు సిద్ధమవుతోంది. త్వరలోనే అధికారులు దర్యాప్తు జరపబోతున్నారు.