AP PENSION TENSION : ఏపీలో మళ్ళీ పెన్షన్ టెన్షన్… ఈసీ ఆదేశాలు పట్టని అధికారులు

ఏపీలో గతంలో వాలంటీర్ల (volunteers) ద్వారా అవ్వా తాతలకు ఇళ్ళకే ప్రతి నెలా ఫస్ట్ నాడు ఫించన్లు ఠంచన్ గా అందేవి. వాలంటీర్లు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు రావడంతో... ఎన్నికల కోడ్ కారణంగా వాళ్ళని పక్కనబెట్టారు. ప్రభుత్వ అధికారులు మాత్రం ఫించన్లను కొన్ని రోజులు ఆలస్యంగా గ్రామ సచివాలయాల్లో మాత్రమే అందించారు.

మే ఫస్ట్ వస్తోంది… దాంతో ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఫించన్ల (Finchans) గొడవ మొదలవబోతోంది. గత నెలలో జరిగిన వివాదమే రిపీట్ కాబోతోంది. ఇంటికే ఫించన్లు అందించాలని ఈసీ ఆదేశాలు ఇచ్చినా… అధికారులు ఇప్పటి దాకా ఎలాంటి చర్యలు మొదలుపెట్టలేదు. ఎన్నికల కోడ్ అడ్డం పెట్టుకొని పేదలకు ఫించన్లు అందకుండా టీడీపీ, విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని మరోసారి జనంలోకి తీసుకెళ్ళాలని వైసీపీ భావిస్తోంది.

ఏపీలో గతంలో వాలంటీర్ల (volunteers) ద్వారా అవ్వా తాతలకు ఇళ్ళకే ప్రతి నెలా ఫస్ట్ నాడు ఫించన్లు ఠంచన్ గా అందేవి. వాలంటీర్లు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు రావడంతో… ఎన్నికల కోడ్ కారణంగా వాళ్ళని పక్కనబెట్టారు. ప్రభుత్వ అధికారులు మాత్రం ఫించన్లను కొన్ని రోజులు ఆలస్యంగా గ్రామ సచివాలయాల్లో మాత్రమే అందించారు. అసలే ఎండలు… పైగా క్యూలైన్లలో వెయింటింగ్ తో కొందరు వృద్ధులు చనిపోయారు. కొందరు అస్వస్థులయ్యారు. ఈ అంశాన్ని తనకు అనుకూలంగా వాడుకుంది వైసీపీ. టీడీపీ (TDP) అవ్వా తాతల ఉసురు తీస్తోందని సీఎం జగన్ తో పాటు మంత్రులు, వైసీపీ (YCP) నేతలు ఓ రేంజ్ లో ప్రచారం చేశారు.

వాలంటీర్లు లేకపోవడం వల్ల ఫించన్లను ఇంటి దగ్గరే పంపిణీ చేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని గత నెలలలో ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయినా ప్రభుత్వ అధికారులు ఇళ్ళకు వెళ్ళి ఇవ్వలేదు. అంటే పరోక్షంగా వైసీపీకి సహకరించారన్న ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు మే1 కి మూడు, నాలుగు రోజులే టైమ్ ఉంది. ఈ నెల అయినా ఫించన్లను లబ్దిదారులకు అందిస్తారా… అధికారులైతే ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈసీ మళ్ళీ ఉత్తర్వులు ఇస్తే తప్ప… అధికారులు స్పందించే పరిస్థితి కనిపించట్లేదు. గత నెలలో తలెత్తిన పరిస్థితే ఇప్పుడు కూడా రిపీట్ అయితే… ఎన్నికల్లో ఎఫెక్ట్ పడుతుందని టీడీపీ, జనసేన(Janasena ), బీజేపీ (BJP) భయపడుతున్నాయి.