BJP Khammam Meeting: తెలంగాణలో బీజేపీ ఓటమికి.. ఖమ్మం సభే రెఫరండమా..?

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎలాగైనా సత్తా తన సత్తా చాటాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.

  • Written By:
  • Publish Date - August 28, 2023 / 09:25 AM IST

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎలాగైనా సత్తా తన సత్తా చాటాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే గత ఏడాది కాలంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్ర పెద్దలతో భారీ బహిరంగసభలు ఏర్పాటు చేస్తున్నాయి. అగనాయకులే కాకుండా అప్పుడప్పుడూ మోదీ హాజరై భారీ ప్రసంగాలు చేస్తూన్నారు. అయినప్పటికీ పార్టీలో ఆశించినంత ఫలితం రావడం లేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. పార్టీ క్యాడర్ బలంగా లేని చోట సభలు, సమావేశాలు ఏర్పటు చేయడం. అలాగే ప్రస్తుతం కేంద్రలో ఉన్న బీజేపీ పాలనలో నిత్యవసర ధరలు విపరీతంగా పెరిగిపోయాలి. అలాగే పెట్రోల్, డీజల్ పై ట్యాక్సులు వంట గ్యాస్ ధరలు ఆకాశానికి నిచ్చన వేస్తుండటందో సామాన్యులకు గుదిబండగా మారింది. పైగా పార్టీలో వర్గపోరుతోపాటూ కొందరి నేతల్లో అసంతృప్తి పెరిగిపోయింది. దీంతో అంటికాగనట్లు వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ కలిసి తెలంగాణ బీజేపీకి ఎదురుదెబ్బ తప్పడంలేదని విశ్లేషకుల వాదన.

జనాలు లేక సభ విలవిల

సాధారణంగా ఓటు వేయడానికి డబ్బులు పంచుతూ ఉంటారు. ఇది మనకు తెలిసిన విష‍యమే. అందరి దగ్గర డబ్బులు తీసుకొని మనకు ఎవరు నచ్చితే వాళ్ళకు మన ఓటు హక్కును వినియోగించుకుంటాం. అయితే కేవలం సభకు ఒకటి రెండు గంటలు వచ్చి కూర్చొని వెళ్ళండి ఓటు సంగతి మళ్ళీ చూద్దాం అంటే కూడా జనాలు రావడం లేదంటే దీనిని ఏవిధంగా చూడాలో ఆపార్టీకే వదిలేయాలి. ఖమ్మంలో గతంలో ఒకసారి అమిత్ షాతో సభ ఏర్పాటు చేయాలని భావించారు. కానీ అక్కడి పరిస్థితిని అమిత్ షా ముందుగా అంచావేసుకొని పర్యటనను రద్దు చేసుకున్నారు. కానీ తాజాగా మరో సారి పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేసి బీజేపీ తన చరిష్మా ఏంటో చూపించుకోవాలనుకుంది. కానీ జనాలు లేక ప్లాన్ బెడిసికొట్టింది. స్థానిక సీనియర్ నేతలు సభ ఏర్పాటు చేయడం మంచిది కాదని చాలా సార్లు చెప్పినట్లు సమాచారం. కానీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సభకు జనాలను సమీకరిస్తామని చెప్పడంతో దీనిని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఎంత ఖర్చైనా సరే సభను విజయవంతం చేయాలని భావించి బస్సులు, కార్లు, ప్రైవేట్ ట్రావెల్స్ ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలు వచ్చేందుకు నిరాకరించారు. దీంతో ముందుగా లక్షమందితో సభ అని చెప్పి చివరకు 20వేల మందితో ఏర్పాటు చేస్తామన్నారు. చివరగా ఫలితం మాత్రం 8 వేల మందికే పరిమితం అయింది. దీంతో సభ ఫెయిల్యూర్ అయినట్లే అని బీజేపీ నేతలో గుసగుసలాడుకుంటున్నట్ల సమాచారం.

పార్టీలో చేరికల సంగతేంటి..

బీజేపీలో గతంలో ఉన్న పార్టీ చేరికలు కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత చాలా వరకూ తగ్గాయని చెప్పాలి. దీనికి కారణం కేంద్రంలో మోదీ రోజుకో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే బీజేపీ పై దక్షిణ భారతదేశంలో వ్యతిరేకత ఉంది. పైగా ఇక్కడి లోకల్ నాయకుల సమర్థవంతమైన పాలనను అందించడంలో విఫలమయ్యారు. కేంద్ర మంత్రి పదవి కేవలం అలంకార ప్రాయంగా మాత్రమే ఉంది తప్పితే చేసిన అభివృద్ది ఎక్కడా కనిపించడంలేదు. పార్టీలో తీవ్రంగా శ్రమించిన వారిని తప్పించి ఎవరికో పెద్ద పెద్ద పదవులను కట్టబెట్టడం నాయకుల్లో కలవరపరిచింది. దీంతో తెలంగాణ రాష్ట్ర పార్టీ చేరికల కమిటీ చైర్మెన్ గా ఈటెలను నియమించినప్పటకీ ఆయన ప్రభావం ఎక్కడా కనిపించడం లేదని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. నిన్న ఖమ్మం సభలో కూడా స్పష్టంగా కనిపించింది. అమిత్ షా సమక్షంలో ఎవరూ పార్టీలో చేరలేదు.

అటు పార్టీలో చేరికలు లేవు. ఇటు సభకు డబ్బులిచ్చి తరలించినా జనాలు రావడం లేదు. అంటే బీజేపీ పాలనపై ఏ స్థాయిలో ప్రజలు వ్యతిరేకత చూపిస్తున్నారని అర్థమౌతుంది. మరి బీజేపీ రానున్న ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ప్రజలను ఆకర్షించి తనపై ఉన్న వ్యతిరేకతను తొలగించుకుంటుందో ఎన్నికల వరకు వేచి చూడాలి.

T.V.SRIKAR