Venu Swami : వేణు స్వామి కోసం వెతుకుతున్న జనం.. దొరికాడా ఫినిష్..

ఈ మధ్యకాలంలో వేణు స్వామి చెప్పిన జాతకాలన్నీ బొక్క బోర్లా పడుతున్నాయి. ఇండియన్ టీం కచ్చితంగా వరల్డ్ కప్ గెలుస్తుందని దీనికి తిరుగులేదని అని చెప్పారు. కాని వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఇండియా దారుణంగా ఓడిపోయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ గెలిచి.. కేటీఆర్ సీఎంగా నేరుగా వెళ్లి ప్రమాణ స్వీకారం చేస్తారని వేణు స్వామి డంకా మోగించి మరి చెప్పారు .అది జరగలేదు. రేవంత్ రెడ్డి అనే వాడికి అసలు రాజయోగమే లేదని ఆయన జీవితంలో ఎన్నటికీ సీఎం కాలేడని కూడా వేణు స్వామి చెప్పారు. తీరా చూస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వెళ్లి కూర్చున్నారు. వేణు స్వామి జాతకాలను నమ్ముకుని చాలామంది లక్షలు.. కోట్లు రుపాయలు బెట్టింగ్ పెట్టి దారుణంగా ఓడిపోయారు. చెప్పాలంటే అత్యంత దారుణంగా మోసపోయారు.

చూడటానికి గుమ్మడి పండులా నిండుగా ఉంటాడు. చాలా అతీంద్రియ శక్తులు , మానవాతీత మహిమలు ఉన్న పెద్ద మనిషిలా బిల్డప్ ఇస్తూ ఉంటాడు. ఏం చెప్పినా చాలా ఆత్మవిశ్వాసంతో కత్తితో కోసినట్లుగా స్పష్టంగా చెప్పేస్తాడు. ఆయనే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి పరంకుశం. ప్రపంచంలో ఏ సబ్జెక్టు గురించైనా మీరు అడగండి. తనదైన భాష్యం తో చెప్పేస్తాడు వేణు స్వామి. ఒక్కొక్కసారి ఆయన మాటలు వింటుంటే సృష్టికి ఈయనే మూలపురుషుడా అనే డౌట్ కూడా వస్తుంది. అడగనోడిది పాపం. ఏ టాపిక్ అయినా సరే అనర్గళంగా చెప్పగల ఈ శతాబ్దపు మేధావి ఆయన. చంద్రయాన్ సక్సెస్ అవుతుందా లేదా, పిఎస్ఎల్వి రాకెట్ ఎగురుతుందా లేదా, ఇండియన్ క్రికెట్ టీం బౌన్సీ పిచ్ పై బ్యాటింగ్ చేయగలుగుతుందా లేదా, సమంతకు మళ్ళీ పెళ్లి అవుద్దా , నిన్న కాక మొన్న పెళ్లి అయిన వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఎప్పుడు విడిపోతారు.

ట్రంప్ కి నాలుగో పెళ్లి యోగం ఉందా లేదా, హైదరాబాదులో ఐటీ ఇండస్ట్రీ ఇంకా డెవలప్ అవుతుందా లేకపోతే ఇక్కడితో ఆగిపోద్దా.. ఐఫోన్ 15 గ్రహబలం ఎలా ఉంది, టాటా షేర్లు లెగుస్తాయా పడిపోతాయా.. ఇలా ఒకటి కాదు కాదు మీ బుర్రలో పుట్టిన ఏ అంశాన్ని అయినా అడగండి ,దాని చెప్పేగల అపర మేధావి , స్వయం ప్రకటిత జ్యోతిష్యుడు, ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి. గడచిన దశాబ్ద కాలంలో వేణు స్వామి ఎక్కడికో ఎదిగిపోయాడు. ఆయనకు మన చేయి చూపిస్తే చాలు , భవిష్యత్తు బంగారం ఐపోయినట్లే.. ఆయన టచ్ చేస్తే చాలు మనమే బంగారం అయిపోతాం అనే ట్రాన్స్ లోకి చాలా మంది వెళ్ళిపోయారు. జనం బలహీనతని వేణు స్వామి కూడా బాగా క్యాష్ చేసుకున్నా డు. జాతకాలు, పూజలు, వాస్తు పూజలు, యాగాలు పేరిట భారీగా గుంజేడు. యూట్యూబ్ ఛానల్s లో తరచూ ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఆ హీరో హీరోయిన్లు విడిపోతారు, ఒక స్టార్ హీరో చచ్చిపోతాడు, మరో స్టార్ హీరో ఆత్మహత్య చేసుకుంటాడు.

ఇలాంటి పనికిమాలిన విషయాల్ని సోషల్‌ మీడియాలో ప్రకటిస్తూ ఉంటాడు వేణు స్వామి. అనుకోకుండా వేణు స్వామి అదృష్టం పుచ్చి ఆ హీరో హీరోయిన్లు విడాకులు తీసుకుంటే ఇక ఆయనకు పండగే. ఇదిగో నేను చెప్పాను వాళ్ళు విడిపోయారు చూశారా అంటూ మరో వీడియో విడుదల చేస్తారు. వాళ్ళు ఎవరో హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకొని విడిపోతే వాళ్లు విడాకులపై వేణు స్వామి వ్యాపారం చేసుకుంటాడు. ఇవాళ రేపు పది పెళ్లిళ్లు జరిగితే రెండేళ్ల తర్వాత పదిలో ఒక పెళ్లి ఎలాగూ విఫలం అవుతుంది. దానికి ప్రత్యేకంగా జాతకం చెప్పాల్సిన అవసరం లేదు. గాలి లో పోయే పేలాలు పిండి కృష్ణార్పణం అన్నట్లు యేదీ జరిగినా తన అకౌంట్‌లో వేసేకుంటారు వేణుస్వామి. అనుకోకుండా ఇప్పుడు వేణు స్వామి జాతకం బాగాలేదు.

ఈ మధ్యకాలంలో వేణు స్వామి చెప్పిన జాతకాలన్నీ బొక్క బోర్లా పడుతున్నాయి. ఇండియన్ టీం కచ్చితంగా వరల్డ్ కప్ గెలుస్తుందని దీనికి తిరుగులేదని అని చెప్పారు. కాని వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఇండియా దారుణంగా ఓడిపోయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ గెలిచి.. కేటీఆర్ సీఎంగా నేరుగా వెళ్లి ప్రమాణ స్వీకారం చేస్తారని వేణు స్వామి డంకా మోగించి మరి చెప్పారు .అది జరగలేదు. రేవంత్ రెడ్డి అనే వాడికి అసలు రాజయోగమే లేదని ఆయన జీవితంలో ఎన్నటికీ సీఎం కాలేడని కూడా వేణు స్వామి చెప్పారు. తీరా చూస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వెళ్లి కూర్చున్నారు. వేణు స్వామి జాతకాలను నమ్ముకుని చాలామంది లక్షలు.. కోట్లు రుపాయలు బెట్టింగ్ పెట్టి దారుణంగా ఓడిపోయారు. చెప్పాలంటే అత్యంత దారుణంగా మోసపోయారు.

వేణు స్వామి జాతకాలతో చాలామంది బికారులై రోడ్డును పడ్డారు.
ఇప్పుడు వేణు స్వామి 2024లో జగన్ మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అవుతాడని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఇప్పటికే వేణు స్వామి జాతకాల నమ్మి రకరకాలుగా మోసపోయిన జనం ఈ డకోట ఆస్ట్రాలజర్ నీ కనిపిస్తే తన్నడానికి సిద్ధంగా ఉన్నారు. వేణు స్వామి తన ఫోన్ బంద్ చేసుకుని మరో కొత్త నెంబర్ నుంచి తన జాతకాలు ఆపరేట్ చేస్తున్నారు. వేణు స్వామి మోసాలు రకరకాలుగా ఉంటాయి ఇండియా క్రికెట్ మ్యాచ్ గెలుస్తుంది అని ఒక వీడియో ,గెలవదు అని ఒక వీడియో చేసి పెట్టుకుంటారు.. మ్యాచ్ అయిపోతే ఇండియా గెలిస్తే గెలిచినట్లుగా ముందే చేసి పెట్టుకున్న వీడియోని పోస్ట్ చేస్తారు.

ఈ ఒక్క క్రికెట్ విషయంలోనే కాదు అన్ని విషయాల్లోనూ ఈ డబల్ వీడియో గేమ్ నడుస్తూనే ఉంటుంది. ఇన్ని సంవత్సరాలకి వేణు స్వామి చెప్పిన జాతకాలు వరుసగా ఫెయిల్ అవ్వడంతో జనం ఆగ్రహం తో ఊగిపోతున్నారు. నెటిజన్లు రకరకాలుగా ట్రోల్‌ చేస్తున్నారు. అసలు వేణు స్వామి అనే వాడికి అక్షరం ముక్క రాదని, జాతకాలు అడ్డం పెట్టుకొని ఆ తర్వాత పూజలు యాగాలు అంటూ కోట్ల రూపాయలు దండేసాడని ఆరోపిస్తున్నారు. అంతే కాదు వేణు స్వామిని ఆడుకుంటూ వెటకారంగా వీడియోలు చేసి సోషల్ మీడియాలో తిప్పుతున్నారు.