Petrol: గుడ్‌ న్యూస్‌ తగ్గనున్న పెట్రోల్‌ డిజీల్‌ ధరలు..

ఈ రోజుల్లో బండి బయటికి తీయడమే పాపమైపోయింది. ఎందుకంటే పెట్రోల్‌ రేటు లీటర్‌కే 110 రూపాయలు ఉంది. ఇక ఫ్రెండో రిలేటివో బైక్‌ అడిగితే.. ఇవ్వను అని చెప్పలేక పెట్రోల్‌ కోసం ఆరాటపడలేక మధ్య తరగతి ప్రజలు పడే పాట్లు అన్నీ ఇన్నీ కాదు.

  • Written By:
  • Publish Date - June 8, 2023 / 04:49 PM IST

ఇలాంటి మధ్య తరగతి వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. త్వరలోనే ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించే అవకాశం ఉందని చెప్పింది. మొన్నటి వరకూ తీవ్ర నష్టాల్లో ఉన్న కంపెనీలు ఆ నష్టాలను పూరించుకునేందుకు పెట్రోల్‌ డీజిల్‌ రేట్లు పెంచాయని.. ఇప్పుడు అన్ని కంపెనీలు దాదాపు లాభాల్లోకి వచ్చేశాయని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. క్వాటర్లీ రిజల్ట్‌లో ఈ విషయం క్లియర్‌ అయ్యిందని చెప్పింది. ఇవాళ ప్రారంభమైన పరపతి విధాన కమిటీలో ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతా దాస్‌ ఈ కామెంట్స్‌ చేశారు.

గురువారం ప్రకటించిన రెపో రేటు 6.5 శాతం వద్దకొనసాగుతున్నట్టు చెప్పారు. ఎంఎస్‌ఎఫ్‌, బ్యాంక్‌ రేట్‌ సైతం 6.75 శాతం దగ్గర స్థిరంగా కొనసాగుతోందన్నారు. రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో ఆర్థిక వ్యవస్థకు సహకారం ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన తన అభిప్రాయాన్ని చెప్పారు. ఆయిల్‌ కంపెనీలు ధరలు తగ్గించే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఇది పేద మధ్య తరగతి ప్రజలకు ఎంతో ప్లస్‌ అవుతుందన్నారు. ఈ విషయంలోనే ఆయిల్‌ కంపెనీల మధ్య జరుగుతున్నట్టు చెప్పారు. ఇక దీని గురించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది. ధరలు తగ్గిస్తే ఎంత వరకూ తగ్గిస్తారో చూడాలి.