PHONE TAPPING: ఫోన్‌ట్యాపింగ్ కేసులో ముందడుగు.. కీలక ఆధారాలు స్వాధీనం

నాగోల్ దగ్గర మూసీలో హార్డ్ డిస్క్ శకలాలను వెలికి తీశారు. ప్రణీత్ రావును మూసీ దగ్గరకు తీసుకెళ్లి మరీ.. హార్డ్‌డిస్క్ శకలాలను గుర్తించారు. 5 ధ్వంసమైన హార్డ్ డిస్క్ కేస్‌లు, మెషీన్‌తో కట్ చేసిన 9 హార్డ్ డిస్క్ ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • Written By:
  • Updated On - April 2, 2024 / 04:46 PM IST

PHONE TAPPING: ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో ట్విస్టు వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ నివేదికలో.. పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. కీలక నిందితుడు ప్రణీత్ రావు మొదట సహకరించపోయినా.. తర్వాత వివరాలు చెప్పాడు. డిసెంబర్‌ నాలుగున హర్డ్‌డిస్క్‌లను ప్రణీత్ రావు మూసీలో పడేసినట్లు పోలీసులు బయటపెట్టారు.

AP CONGRESS: ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.. కడప నుంచి ఎంపీగా షర్మిల పోటీ

నాగోల్ దగ్గర మూసీలో హార్డ్ డిస్క్ శకలాలను వెలికి తీశారు. ప్రణీత్ రావును మూసీ దగ్గరకు తీసుకెళ్లి మరీ.. హార్డ్‌డిస్క్ శకలాలను గుర్తించారు. 5 ధ్వంసమైన హార్డ్ డిస్క్ కేస్‌లు, మెషీన్‌తో కట్ చేసిన 9 హార్డ్ డిస్క్ ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 6 మెటల్ హార్డ్ డిస్క్ ముక్కలను కూడా గుర్తించి బయటకు తీశారు. ప్రణీత్ రావు చెప్పిన సమాచారంతో.. ఎస్ఐబీ ఆఫీస్‌లనూ పలు ఆధారాలను గుర్తించారు. 12 కంప్యూటర్లు, 7 సీపీయూలు, ల్యాప్‌టాప్, మానిటర్, పవర్ కేబుళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలక్ట్రిషియన్ గదిలో ముక్కలైన హార్డ్ డిస్క్ పొడిని కూడా తీసుకున్నారు. ఎస్ఐబీ ఆఫీస్‌ ఆవరణలో పాక్షికంగా కాలిన డాక్యుమెంట్లు, స్పైరల్ బైండింగ్‌లతో పాటు ఎస్ఐబీ కార్యాలయం సీసీ ఫుటేజి లాగ్ బుక్ ప్రతులను కూడా పోలీసులు సేకరించారు.

ఇక ఎస్ఐబీ కానిస్టేబుల్ కొత్త నరేష్ గౌడ్‌ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. బీఆర్ఎస్‌ పార్టీ కాకుండా మిగిలిన పార్టీ అభ్యర్థుల డబ్బుల పంపిణీపై తాము నిఘా పెట్టినట్లు ఎస్ఐబీ కానిస్టేబుల్ వాంగ్మూలం ఇచ్చాడు. భుజంగరావు, తిరుపతన్న స్వయంగా నేరాన్ని అంగీకరించినట్లు రిమాండ్ నివేదికలో పోలీసులు వెల్లడించారు. ప్రైవేట్ వ్యక్తులపై అక్రమ నిఘా పెట్టడంలో భుజంగరావు, తిరుపతన్న కుట్ర ఉన్నట్లు రిమాండ్ నివేదికలో తేల్చారు పోలీసులు.