PHONE TAPPING: తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకు పోలీసులు నోటీసులిచ్చే అవకాశాలున్నాయి. ఈ కేసులో రోజుకో సంచలనం బయటకు వస్తోంది. గత BRS ప్రభుత్వంలో ఈ ట్యాపింగ్ కేసులో ఐదుగురు నేతలు, మాజీ మంత్రులు కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. టాస్క్ ఫోర్స్ మాజీ చీఫ్ రాధాకిషన్ రావు విచారణలో ఆ ఐదుగురి పేర్లు బయటకు వచ్చినట్టు సమాచారం.
Akhilesh Yadav Daughter: యూపీ ప్రచారంలో అదితి ఫిదా.. తల్లి డింపుల్ గెలుపు కోసం తంటాలు
BRS హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌లో ఐదుగురు నేతలు కీలకంగా వ్యవహరించినట్టు చెబుతున్నారు. ఇందులో ప్రమేయం ఉందని భావిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్‌కి పోలీసులు నోటీసులు ఇచ్చే ఛాన్సుంది. అలాగే మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావు, నవీన్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావుకి కూడా నోటీసులిస్తారని తెలుస్తోంది. టాస్క్ ఫోర్స్ మాజీ బాస్ రాధా కిషన్ రావు స్టేట్మెంట్‌లో ఈ నేతల పేర్లు బయటకు వచ్చినట్టు సమాచారం. అయితే పోలీసులు కూడా రాజకీయ నేతల అక్రమాలకు సంబంధించి.. నేరాన్ని నిరూపించేందుకు అవసరమైన ఆధారాలను సేకరిస్తున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్‌లు దొరికిన తర్వాత పొలిటికల్ లీడర్లపై కేసులు పెడతారని తెలుస్తోంది. అలాగే SIB మాజీ ఛీఫ్ ప్రభాకర్ రావు కూడా త్వరలోనే హైదరాబాద్‌కు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయనను విచారిస్తే టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం బయటకు వస్తుంది.
OSDలుగా పనిచేసిన ఇద్దరు పోలీస్ అధికారులు ఈ కేసులో అప్రూవర్లుగా మారతారని చెబుతున్నారు. ఈ కేసులో టెక్నికల్ ఎవిడెన్సే కీలకంగా మారింది. అది దొరికితే.. టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసులు పెట్టే ఛాన్సుంది. ఇక ఫోన్ ట్యాపింగ్‌పై మొదటిసారిగా స్పందించారు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. ఈ కేసు విచారణ పారదర్శకంగా నడుస్తోందన్నారు. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు బయటపెడతామని తెలిపారు. పొలిటికల్ లీడర్లకు నోటీసులు ఇవ్వడంపైనా త్వరలోనే వివరాలను వెల్లడిస్తానని సీపీ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.