ఒక్క కేసు వంద ప్రశ్నలు. ఒక్క ఫొటోగ్రాఫ్ వెయ్యి అనుమానాలు. కలకత్తా డాక్టర్ కేసులో డే బై డే బయటికి వస్తున్న విషయాలు.. సమాధానాలు దొరకని ఎన్నో ప్రశ్నలకు తావిస్తున్నాయి. హాస్పిటల్‌లో డాక్టర్ చనిపోయిన తరువాత.. ఆ స్పాట్‌కు పోలీసులు చేరుకునే గ్యాప్‌లో.. డెడ్‌బాడీ చుట్టూ కొందరు వ్యక్తులు నిల్చున్న ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. అనేక చిక్కుముడులతో ఉన్న ఈ కేసులో ఈ ఫొటోలు ఇప్పుడు మరో వంద ప్రశ్నలకు కారణమయ్యాయి. ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తులు ఎవరు ? పోలీసుల కంటే ముందు అక్కడ ఏం చేస్తున్నారు ? డాక్టర్ చనిపోయిన తరువాత.. స్పాట్‌కు పోలీసులు వచ్చే గ్యాప్‌లో అక్కడ ఏం జరిగింది ? ఆధారాలు మాయం చేశారా? అసలు బాడీనే మాయం చేయాలి అనుకున్నారా ? ఇప్పుడు ప్రతీ ఒక్కరిలో ఉన్న డౌట్స్ ఇవే. అయితే ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ రెండు ఫొటోలకు పోలీసుల నుంచి వచ్చిన సమాధానం మాత్రం ప్రాపర్‌గానే కనిపిస్తోంది. ఎందుకంటే వైరల్ అవుతున్న రెండు ఫొటోలను ఫ్రేమ్ చేసి.. అందులో ఉన్న ప్రతీ వ్యక్తి గురించి క్లియర్‌గా మెన్షన్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు పోలీసులు. తెల్లవారుజామున నాలుగు గంటలకు ఈ ఘటన జరిగిన తరువాత కాసేపటికే విషయం పోలీసులకు తెలిసింది. దీంతో ఉదయం పదిన్నర లోపే తలా స్టేషన్ పోలీసులు ఆర్జీకర్ హాస్పిటల్‌కు చేరుకున్నారు. స్పాట్‌కు ఎవరూ రాకుండా క్లియర్ చేశారు. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఫస్ట్ ఫొటోలో కనిపిస్తున్నది వాళ్లే. కొందరికి యూనిఫాం లేకపోవడం, హాస్పిటల్‌తో కూడా సంబంధం ఉన్న వ్యక్తుల్లా అనిపించకపోవడంతో వాళ్లు బయటి వ్యక్తులని అంతా అనుకున్నారు. కానీ వాళ్లంతా స్పాట్ నుంచి ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకునేందుకు వచ్చిన స్టాఫ్ అంటూ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అదే స్పాట్ నుంచి మరో ఫొటో కూడా ఇంటర్నెట్‌లోకి లీకయ్యింది. ఆ ఫొటోలో ఉన్నది కూడా ఫోరెన్సిక్ నుంచి వచ్చిన నిపుణులే అంటూ చెప్తున్నారు పోలీసులు. అడిషనల్ సీపీ వినీత్ గోయల్ ఆధ్వర్యంలోనే అక్కడ ఎవిడెన్స్ కలెక్షన్ అంతా జరిగింది. ఫొటోలో కనిపించిన వ్యక్తులంతా ఫింగర్ ప్రింట్స్, ఫొలోగ్రాఫ్స్ కలెక్ట్ చేసుకునేందుకు వచ్చిన స్టాఫ్ అని పోలీసులు చెప్తున్నారు. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నట్టు అక్కడ ఆధారాలు తారుమారు చేసేందుకు అసలు ఎలాంటి అవకాశం లేదు, జరగలేదు అనేది పోలీసులు వాదన. ఎవరూ ఆ గదిలోకి రాకముందే క్రైమ్ సీన్‌ను పోలీసులు ఫుల్‌గా కవర్ చేశారని డిపార్ట్‌మెంట్ నుంచి అధికారికంగా ప్రకటించారు. సో.. ఓవరాల్‌గా క్రైమ్ సీన్ నుంచి ఒక్క ఎవిడెన్స్ కూడా బయటికి వెళ్లలేదు అనేది క్లియర్. ఇక ఈ కేస్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ రావాలి అంటే.. అది మెయిన్ అక్యూస్డ్ సంజయ్ రాయ్ నుంచి.. సెకండరీ సస్పెక్ట్ సందీప్ ఘోష్ నుంచే రావాలి. ప్రస్తుతం వాళ్లిద్దరినీ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వాళ్ల నుంచి పూర్తి స్థాయిలో స్టేట్‌మెంట్ తీసుకున్న తరువాత మాత్రమే.. ఈ కేసులో మరో అప్‌డేట్ వచ్చే ఛాన్స్ ఉంది.