గూగుల్ CEO (Google CEO), భారత (Bharat) సంతతి వ్యక్తి గూగుల్ పిచాయ్ (Sundar Pichai) కి పదవీ గండం పొంచి ఉంది. ఆయన్ని ఆ CEO పదవి నుంచి తొందర్లోనే తప్పిస్తారన్న టాక్ నడుస్తోంది. జెమినీ AI ఇమేజ్ జనరేటర్ సేవలను నిలిపివేసిన ప్రభావం పిచాయ్ పై తీవ్రంగా పడుతోంది. ఆయన్ని బాధ్యతల నుంచి తప్పుకోవాలని మేనేజింగ్ బోర్డు నుంచి ఒత్తిడి పెరుగుతోంది.
ఈ మధ్యే AI Gemini ఇమేజ్ జనరేటర్ ను అందుబాటులోకి తెచ్చింది గూగుల్. AI మార్కెట్ లో నిలదొక్కుకోవాలన్న లక్ష్యంగా గూగుల్… జెమినీపై భారీ ఎత్తున పెట్టుబడి పెట్టింది. దీనిపై సుందర్ పిచాయ్ కూడా చాలా అంచనాలు పెట్టుకున్నారు.. కానీ అనుకున్న స్థాయిలో పనిచేయకపోవడంతో ఆ సేవలను నిలిపేసింది గూగుల్. దాంతో కంపెనీ క్రెడిబిలిటీ దెబ్బ తిన్నదని అంటున్నారు. అందుకే సుందర్ పిచాయ్ ను గూగుల్ మేనేజ్ మెంట్ బోర్డు తప్పించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. గూగుల్ CEO పదవి నుంచి పిచాయ్ ని తప్పించి మరొకరికి అవకాశమివ్వాలని భావిస్తున్నట్టు సమాచారం.
జెమినీ ఇమేజ్ జనరేటర్ క్రియేట్ చేస్తున్న ఇమేజ్ ల్లో పెద్దఎత్తున తప్పులు వస్తున్నాయి. అందుకే ప్రస్తుతానికి జెమినీ టూల్ సేవలను గూగుల్ బంద్ పెట్టేసింది. AI టెక్నాలజీపై పెట్టుబడులను కూడా తగ్గించినట్టు సమాచారం. ఈ సర్వీస్ నిలిపివేసినప్పటి నుంచే కంపెనీలో అంతర్గత విభేదాలు తలెత్తుతున్నాయి. గూగుల్ స్టాక్స్ పెద్ద ఎత్తున నష్టపోతున్నాయి. అందుకే సుందర్ పిచాయ్ సహా కీలక పోస్టుల్లో ఉన్న వారిని మార్చాలని బోర్డ్ భావిస్తోంది. ఇప్పటికే గూగుల్‌లో మేనేజ్‌మెంట్ విషయంలో చాలా సమస్యలున్నట్టు సమాచారం. నష్టాల్ని భర్తీ చేసుకునేందుకు గూగుల్ పెద్ద ఎత్తున లేఆఫ్‌లు ప్రకటించింది. కాస్ట్ కట్టింగ్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.
పేరెంట్ కంపెనీ Alphabet కూడా… డిజిటల్ అసిస్టెంట్, హార్డ్‌వేర్, ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్స్‌లో వందమందిని తొలగిస్తామని ప్రకటించింది. వాయిస్ బేస్డ్ Google Assistant తో పాటు AR హార్డ్‌వేర్‌లోని ఉద్యోగులపై ఈ ప్రభావం పడనుంది. వీళ్లతో పాటు కంపెనీ సెంట్రల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్‌లోని ఉద్యోగులను కూడా తొలగిస్తున్నారు. జెమినీ ఇమేజ్ జనరేటర్ సృష్టించిన సంక్షోభం… గూగుల్ CEO సుందర్ పిచాయ్ పై తీవ్రతంగా పడింది. అది సక్రమంగా పనిచేస్తే… ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో తమకు తిరుగులేదని గూగుల్ భావించింది. ఇప్పుడా ప్లాన్ బెడిసికొట్టడంతో గూగుల్ కి నష్టాలు తప్పడం లేదు.