పీజేఆర్ (PJR).. ఇది మూడక్షరాల పేరు కాదు.. ఓ బ్రాండ్. ఖైరతాబాద్ (Khairatabad) పేరు ఉన్నన్ని రోజులు వినిపించే పేరు ఇది. అలాంటి పెద్దాయన బిడ్డ అంటే మాములుగా ఉంటారా ! ఖైరతాబాద్ అంతా ఏకమై ప్రేమతో ముంచేయదూ ! ఈసారి అదే జరగబోతోంది. తెలంగాణ ఎన్నికల వేళ.. రాజకీయం భగ్గుమంటోంది. రకరకాల సర్వేలు.. పాలిటిక్స్‌ను మరింత హీటెక్కిస్తున్నాయ్. ఖైరతాబాద్‌లో ఎవరు గెలవబోతున్నారనే దానిపై ఓ సర్వే రిలీజ్ అయింది. ఇది చూసిన ప్రతీ ఒక్కరు.. పీజేఆర్ కూతారా.. మజాకా అంటున్నారు. ఖైరతాబాద్ (Khairatabad) లో విజయా రెడ్డి (Vijaya Reddy) విజయం ఖాయంగా కనిపిస్తోంది.
KCR Vs Revanth Reddy : కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి పోటీ.. గెలిచే సీన్ ఉందా.. కామారెడ్డి టాక్ ఏంటి?
తెలంగాణలో అధికారం కోసం కారుకు, కాంగ్రెస్‌కు మధ్య మినీ యుద్ధమే జరుగుతోంది. బీఆర్ఎస్‌కు చెక్ పెట్టేలా హస్తం పార్టీ సరికొత్త వ్యూహాలతో దూసుకుపోతోంది. కారును గద్దె దింపడం ఖాయం అనే నమ్మకానికి జనాలు వచ్చేశారు దాదాపుగా..! దానికి తగినట్లే ఇప్పటివరకు విడుదలైన అనేక సర్వేల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని తేలింది. అటు ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనే దానిపై ఓ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరపున సీనియర్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కాంగ్రెస్ తరపున పీజేఆర్ కూతురు విజయారెడ్డి, బీజేపీ తరఫున చింతల రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు.
Guntur Kaaram: ప్రోమోనే బాగుంది ! గుంటూరు కారం సాంగ్ రివ్యూ..
వీరిలో ఎవరికి ఓటు వేస్తారనే దానిపై ఆ సంస్థ.. జనాలను ఆరా తీయగా మెజారిటీ జనాలు విజయారెడ్డి వైపే మొగ్గుచూపారని తేలింది. దివంగత నేత పి. జనార్దన్ రెడ్డి అలియాస్ పీజేఆర్ కుమార్తె రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయారెడ్డి.. అనతికాలంలోనే తండ్రికి తగ్గ కూతురు గా పేరు తెచ్చుకున్నారు. పేదల కోసం నిరంతరం పోరాడుతూ తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారు. ఏ పార్టీలో ఉన్నా జనాల క్షేమం కోసమే నిరంతరం పనిచేస్తున్నారు. ప్రతి ఇంటి ఆడబిడ్డగా తమ మనసుల్లో సుస్థిర స్థానం దక్కించుకున్న విజయారెడ్డిని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తామంటున్నారు స్థానికులు. అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ విజయారెడ్డి ఈసారి ఎమ్మెల్యేగా గెలవడం పక్కా అంటున్నారు.