Prashant Kishore : పీకే సంచలన వ్యాఖ్యలు.. జగన్ కు దారుణంగా ఓటమి.. 40 సీట్లు కూడా రావు

ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ (CM Jagan) దారుణంగా ఓడిపోబోతున్నారు. ఏంచేసినా గెలవడం కష్టం. వైసీపీకి 40 సీట్లకు మించి రావు...అంటూ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) చేసిన వ్యాఖ్యలు ఏపీలో ఇప్పుడు సంచలనంగా మారాయి. రాబోయే ఎన్నికల్లో జగన్ కు మామూలుగా కాదు... భారీగా ఓటమి తప్పదు అంటున్నారు పీకే. హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ కామెంట్స్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ (CM Jagan) దారుణంగా ఓడిపోబోతున్నారు. ఏంచేసినా గెలవడం కష్టం. వైసీపీకి 40 సీట్లకు మించి రావు…అంటూ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) చేసిన వ్యాఖ్యలు ఏపీలో ఇప్పుడు సంచలనంగా మారాయి. రాబోయే ఎన్నికల్లో జగన్ కు మామూలుగా కాదు… భారీగా ఓటమి తప్పదు అంటున్నారు పీకే. హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ కామెంట్స్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో అధికారపార్టీ వైసీపీ (YCP) కి తీవ్ర వ్యతిరేకత ఉంది. రాయలసీమతో పాటు… ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో కూడా ఆ పార్టీకి ఓటమి తప్పదు అంటున్నారు ప్రశాంత్ కిషోర్. జనం సొమ్ము ఖర్చుపెడుతూ… వాళ్ళనేదో బాగోగు చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తే పొరపాటనీ… జగన్ చేసేది ఇదే అని విమర్శించారు. ఏపీలో చదువుకున్న వాళ్ళల్లో చాలామందికి జగన్ ప్రభుత్వంపై అసంతృప్తి ఉంది. వాళ్ళకి ఉద్యోగాలు కావాలి కానీ… ఉచిత పథకాలు కాదన్నారు పీకే. భవంతిలో కూర్చుని బటన్ నొక్కుతూ పథకాలకు డబ్బులు ఇస్తున్నామంటే… ఎవరూ ఓట్లేయరు. డబ్బులిస్తే ఓట్లేస్తారు అనుకుంటే… అసలు ఎక్కడా ఏ పార్టీ కూడా ఓడిపోదన్నారు పీకే. దక్షిణాది రాజకీయాల్లో డబ్బుల సంస్కృతి బాగా అలవాటైంది. కానీ డబ్బు తీసుకున్నా కదా… వాళ్ళకే ఓట్లేద్దామని జనం అనుకోవట్లేదని సంచలన కామెంట్స్ చేశారు ప్రశాంత్ కిషోర్. వైసీపీ డబ్బులు విపరీతంగా ఖర్చుపెట్టొచ్చు. వాళ్ళంతా ఆ పార్టీకే ఓటు వేస్తారన్న నమ్మకం లేదన్నారు.

నిరుద్యోగం, తప్పుడు హామీలు, పరిపాలన చేతకాపోవడం లాంటి అంశాలు జగన్ కు మైనస్. వాటి వల్లే ఆయన ఓడిపోతారని చెప్పారు పీకే. తెలంగాణలో కేసీఆర్ కు పట్టిన గతే జగన్ కీ పడుతుందన్నారు. ఈసారి ఏపీలో తెలుగు దేశం బంపర్ మెజారిటీతో గెలుస్తుంన్నారు వ్యూహకర్త పీకే. గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేన క్లీన్ స్వీప్ చేస్తాయి. జనసేనకు 53శాతం ఓటింగ్ వస్తుందన్నారు పీకే. గత ఎన్నికల్లో వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్. రెండేళ్ళ క్రితం ఏ పార్టీకి పనిచేయబోనని చెప్పారు. కానీ ఆయన ఏర్పాటు చేసిన ఐప్యాక్ టీమ్ ఇప్పటికీ జగన్ కు అనుకూలంగా ఏపీలో పనిచేస్తోంది. ప్రశాంత్ కిషోర్ కొన్ని నెలల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో సమావేశం అయ్యారు. పీకే టీడీపీ (TDP) కి పనిచేస్తారన్న టాక్స్ వచ్చాయి. కానీ అటు టీడీపీ గానీ, ఇటు పీకే గానీ ధృవీకరించలేదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందన్న పీకే… తాను ఏపీలో సర్వేలు చేసినట్టు మాత్రం చెప్పలేదు.