SC Classification: ఎస్సీ వర్గీకరణపై కేంద్రం కమిటీ.. హామీ నిలబెట్టుకున్న మోదీ..

మొత్తం ఐదుగురు సభ్యులతో ఈ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. దీనిలో కేంద్ర హోంశాఖ, న్యాయశాఖ, గిరిజిన శాఖ, సామాజిక న్యాయ శాఖ కార్యదర్శులకు స్థానం కల్పించింది. వీలైనంత త్వరగా కమిటీని రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది.

  • Written By:
  • Publish Date - January 19, 2024 / 02:37 PM IST

SC Classification: చాలా ఏళ్లుగా డిమాండ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణపై కేంద్రం ముందడుగు వేసింది. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ హామీ ఇచ్చినట్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ నేతృత్వం వహిస్తారు. మొత్తం ఐదుగురు సభ్యులతో ఈ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. దీనిలో కేంద్ర హోంశాఖ, న్యాయశాఖ, గిరిజిన శాఖ, సామాజిక న్యాయ శాఖ కార్యదర్శులకు స్థానం కల్పించింది. వీలైనంత త్వరగా కమిటీని రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది.

Ayodhya Seethamma : అయోధ్యలో సీతమ్మకు సిరిసిల్ల చీర..

కేంద్ర ఆదేశాలతో వీలైనంత త్వరగా రిపోర్టు ఇవ్వడానికి కమిటీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసంఈ నెల 23న తొలిసారిగా సమావేశం కానుంది. ఈ సమావేశంలో.. ప్రభుత్వానికి త్వరగా రిపోర్ట్ ఇవ్వడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. ఎస్సీ వర్గీకరణ కోసం సబ్-కేటగిరైజేషన్ ప్రక్రియలో భాగంగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నవంబరు 24నే కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, ఇతర సీనియర్ అధికారులను ప్రధాని మోదీ ఆదేశించారు. మరోవైపు.. ఎస్సీ వర్గీకరణ కోసం ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు సుప్రీంకోర్టు గతంలోనే అంగీకారం తెలిపింది. అయితే, కేంద్రం మాత్రం ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో హైదరాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో, మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఎస్సీ ఉపకులాల విశ్వరూప మహాసభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. మాదిగలకు సాధికారత కల్పించడానికి ఓ కమిటీని త్వరలో ఏర్పాటు చేస్తామని అప్పుడు ప్రకటించారు. దీని ప్రకారమే తాజా నిర్ణ‍యం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష‌్ణ మాదిగ నేతృత్వంలో ఎమ్మార్పీఎస్ గత మూడు దశాబ్దాలుగా పోరాడుతోంది.