PM MODI: తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని, బీజేపీ మాత్రమే తెలంగాణ ప్రతిష్టను పెంచుతుందన్నారు ప్రధాని మోదీ. కరీంనగర్‌లో సోమవారం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు. “తెలంగాణలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. బీసీ అభ్యర్థిని సీఎం చేస్తాం. హిందూ దేశంలో తెలంగాణను అగ్రస్థానంలో ఉంచుతాం. బీజేపీ మాత్రమే తెలంగాణ ప్రతిష్టను పెంచుతుంది. కరీంనగర్ షోడశ మహాపదాల్లో ఒకటి.
TELANGANA CONGRESS: హరీష్ రావు మైండ్ బ్లాక్ అయింది.. బీఆర్ఎస్‌ది తప్పుడు ప్రచారం: కాంగ్రెస్ నేతలు
ప్రజాస్వామ్యానికి భారత్ పుట్టినిల్లు. పదేళ్లుగా తెలంగాణ అభివృద్ది కుంటుపడింది. పదేళ్ల పిల్లల భవిష్యత్తు విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఆలోచించి, నిర్ణయం తీసుకోవాలి. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే. కాంగ్రెస్, బీఆర్ఎస్ మీ పిల్లల భవిష్యత్తును నాశనం చేశాయి. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే.. బీఆర్ఎస్‌కు ఓటేసినట్లే. రెండు పార్టీలూ తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎప్పుడు బీఆర్ఎస్‌కు వెళ్తారో తెలియదు. దేశంలోని అన్ని రాష్ట్రాలను బీజేపీ అభివృద్ధి చేస్తుంది. కేసీఆర్ వద్దనుకుంటే కాంగ్రెస్‌కు కూడా ఓటేయొద్దు. తెలంగాణ నుంచి పీవీ నరసింహా రావు ప్రధాని అయ్యారు. కుటుంబ పాలనలో పీవీకి అన్యాయం జరిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ అంటే అవినీతి, కుటుంబ పాలనే. అలాంటి కుటుంబ పాలనలో ఎప్పుడూ తమ పిల్లల గురించే ఆలోచిస్తారు. తెలంగాణలో నక్సలిజం ఉంది. నక్సలిజానికి చెక్ పెట్టేది బీజేపీ మాత్రమే. కరీంనగర్‌ను స్మార్ట్ సిటీ చేస్తామంటే బీఆర్ఎస్ అడ్డుకుంది. కరీంనగర్‌కు కేసీఆర్.. లండన్ చేస్తానన్నారు.. అది ఏమైంది..?
CONGRESS ALERT: ఆ మూడు రోజులు జాగ్రత్త.. కేడర్‌ని అలెర్ట్ చేసిన కాంగ్రెస్..
ఫిలిగ్రీ కళకు తెలంగాణ పెట్టింది పేరు. మా ప్రభుత్వం రైతుల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటుంది. అవినీతిని అరికట్టేందుకు నేను గ్యారెంటీ. రైతులకు నీళ్లు ఇవ్వడంలోనూ కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారు. దానికి శిక్ష పడాలా.. వద్దా..? నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడ..? మోదీ నీడ పడితేనే.. కేసీఆర్ భయపడుతున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెట్రోల్ తక్కువ ధరకే వస్తోంది. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం. అందరికీ ఉచిత రేషన్ అందిస్తాం. హస్తకళాకారులకు సాయం చేస్తున్నాం. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పీఎఫ్‌ఐ వంటి తీవ్రవాద సంస్థలు పెరిగాయి. డిసెంబర్ 3న కేసీఆర్ పని అయిపోతుంది. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాలి. అవినీతి రహిత ప్రభుత్వం కావాలంటే బీజేపీ రావాలి. కేసీఆర్ ఫాం హౌజ్ సీఎం.. మోదీ దేశానికి పీఎం. ఇరిగేషన్ స్కాంలో అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపిస్తాం” అని మోదీ వ్యాఖ్యానించారు.